సరిలేరు నీకవ్వరూ : షూట్ కూడా మొదలు కాక ముందే ఫ్యాన్సీ రేట్

మహర్షి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మహేశ్ బాబు మంచి ఫాంలో ఉన్నాడు. దాదాపు నెల రోజుల పాటు ఫ్యామిలీతో విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేసి మొన్నీమధ్యే తిరిగివచ్చాడు. ఇక ఇప్పుడు మహేష్ అనిల్ రావిపూడితో తర్వాతి సినిమా చేయనున్నాడు. సరిలేరు నీకెవ్వరు అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ మధ్యే పూజా కార్యకరమాలతో మొదలయ్యింది. అయితే ఈ సినిమాని కాంబినేషన్ అలాగే మార్కెట్ దృష్ట్యా ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూట్ కూడా ఇంకా మొదలు కాకుండానే ఈ సినిమాని ఫ్యాన్సీ రేట్ పెట్టి శాటిలైట్ రైట్స్ కొనుక్కుంది జెమినీ టీవీ. ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తుంన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఫ్రెండ్ కోసం ఆర్మీ వదిలేసి అతడి కుటుంబాన్ని ఆదుకోడానికి వచ్చే పాత్రలో మహేశ్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి కీలకమైన పాత్రలో నటించబోతుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు, అనిల్ సుంకరలు కలిసి నిర్మిస్తున్నారు.