English   

అప్పుడు విమర్శించి ఇప్పుడు షో ఎలా చేస్తున్నాడో నాగ్ 

Nagarjuna
2019-06-25 08:50:41

తెలుగు బుల్లితెర మీద బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడంతో తెలుగు టీవీ చరిత్రలో ఈ షో అత్యధిక టీఆర్‌పీని సొంతం చేసుకుంది. ఇక రెండో సీజన్‌ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేసి అలా అలా కానిచ్చారు. ఇక మూడో సీజన్ కోసం ఆసక్తిగా తెలుగు ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 3కి మళ్లీ ఎన్టీఆర్‌నే హోస్ట్‌గా తెచ్చే ప్రయత్నం చేసినా ఆర్ఆర్ఆర్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. నానిని అడిగారో లేదో తెలీదు కానీ చివరికి అక్కినేని నాగార్జున, విజయ్ దేవరకొండ పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. ఇక ఫైనల్ గా నాగ్ పేరునే ఖారారు చేసినట్టు సమాచారం. అయితే గతంలో బిగ్ బాస్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు ఆయన బిగ్ బాస్ ప్రోగ్రాంను వ్యతిరేకించాడు. కానీ ఇప్పుడు ఆయనే బిగ్ బాస్ మూడో సీజన్‌ హోస్ట్‌గా రానున్నాడు. గత ఏడాది నానితో కలిసి చేసిన దేవదాస్ సినిమా ప్రమోషన్ల సందర్భంగా నాగ్ బిగ్ బాస్ మీద నెగటివ్ గా స్పందించారు. ఆ సమయానికి నాని హోస్ట్ గా ఉండడంతో, బిగ్ బాస్ గురించి నాగ్ ని అడిగితే బిగ్ బాస్ షో అంటే నాకు నచ్చదని. ఆ షో గురించి మాట్లాడితే నెగటివ్ కకామెంట్స్ చేయాల్సి వస్తుంది అని అన్నాడు. తానేమీ హోస్ట్ నాని గురించి అనడం లేదన్న అయన ఈ షో కాన్సెప్టే తనకు నచ్చదన్నాడు. ఎదుటి వాళ్లు ఏదో చేస్తుంటే చాటు నుంచి చూడటం అన్న కాన్సెప్ట్ కరెక్ట్ కాదని, ఇది గాసిప్‌తో సమానం అని అన్నాడు నాగ్. ఇక కాస్తంత ఎమోషనల్ టచ్ ఇచ్చేందుకు అక్కడ వాయిరిస్టిక్ అనే పదాన్ని కూడా ఉపయోగించాడు. వాయిరిస్టిక్ అంటే వేరే వ్యక్తులు నగ్నంగా శృంగారం లో ఉంటె చూసి పైశాచిగా ఆనందం పొందడం అంటూ భారీ స్థాయిలో మాట్లాడిన ఆయన ఇప్పుడు అదే షోకి హోస్ట్ గా వస్తున్నాడు. ఇదే విషయాన్ని పట్టుకుని యాంటీ ఫాన్స్ ఆ వీడియోలను బయటకు తీసి ట్రోల్స్ మొదలు పెట్టారు. 

More Related Stories