English   

మళ్ళీ లైన్ లోకి కృష్ణ వంశీ 

Krishna Vamsi
2019-06-25 15:23:38

గత కొంతకాలంగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సైలెంట్ అయిపోయాడు. కృష్ణవంశీ గతంలో ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే గత కొద్దిరోజులుగా ఆయనకు కాలం కలిసి రావడం లేదు. రామ్ చరణ్ తో తెరకెక్కించిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. దీంతో చాలా కాలం గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ తెరకెక్కించిన నక్షత్రం సినిమా కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో డీలా పడ్డ కృష్ణవంశీ సైలెంట్ అయిపోయాడు. మధ్యలో బాలయ్యతో సినిమా చేయాలనుకున్నాడు కానీ వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు తన తదుపరి సినిమా కోసం సన్నాహాలు మొదలుపెట్టాడు. నిజానికికి నక్షత్రం సినిమా తర్వాత కృష్ణవంశీ రుద్రాక్ష అనే సినిమా ప్లాన్ చేసారు. సోషియో ఫాంటసీ జోనర్ సినిమాగా ఈ సిన్మాని తెరకెక్కించాలని స్క్రిప్టు కూడా రెడీ సమంత, రమ్య కృష్ణలు ముఖ్య పాత్రల్లో దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ సినిమాని  చేయాల్సి ఉంది. ఎందుకో గానీ ఈ సినిమా ఆగిపోయింది.  అయితే అందుతున్న సమాచారం ప్రకారం కృష్ణవంశీ ఆ సినిమా మళ్ళీ లైన్ లో పెట్టారు. ఆ మేరకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే బండ్లకి మళ్ళీ సినిమాలు ఇద్ద్మనుకుంటున్న దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ఆయనకీ సెట్ చేసే పనిలో ఉన్నాడట. రుద్రాక్ష సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కాగా అనుష్కని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ఓకె చెప్తే సినిమా అనౌన్స్ మెంట్ చేయచ్చు.
 

More Related Stories