సినీ కాస్ట్యూమర్ ఆత్మహత్య

ఏడవ తరగతి చదువుతున్న కుమారుడి స్కూల్ ఫీజ్ కట్టలేని కోలీవుడ్ కాస్ట్యూమర్ ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళ ఇండస్ట్రీలో కలకలంగా మారింది. చెన్నై కోడంబాక్కమ్ ప్రాంతంలో వెంకట్రామన్ (45) అనే సినీ కాస్ట్యూమర్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అయితే ఒకప్పుడు ఆయనకు అవకాశాలు ఉన్నా, ఈ మధ్య కాలంలో అవకాశాలు తగ్గిపోయాయి. నెలకు రెండు రోజుల పని కూడా దొరకడం లేదు. దీంతో ఇప్పటి దాకా భార్య నగలను విక్రయించి, కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చాడు. అయితే తాజాగా వెంకట్రామన్ చిన్న కొడుకు 7వ తరగతిలో చేరాల్స్ ఉంది, స్కూల్ మొదలయ్యే సమయం దగ్గరపడడంతో స్కూల్ పీజు కట్టడానికి డబ్బు అవసరమైంది. ఎవరిని అడిగి చూసినా డబ్బు దొరకలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన, ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న వడపళని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయం మీద తమిళ ఇండస్ట్రీ వారు సంతాపం తెలియచేస్తున్నారు.