English   

సిగరెట్ తాగి ఇప్పుడు పని చేసుకోమంటున్నాడు 

 Ram
2019-06-25 18:21:50

పూరీ డైరెక్షన్ లో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ లు హీరోయిన్గ్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తరచూ వార్తల్లో నిలుస్తోంది. వరల్డ్ కప్ దెబ్బకు సినిమా వాయిదా పడిందని ప్రకటన వచ్చ్హిన మరుసటి నాడే హీరో రామ్ బహిరంగంగా సిగరెట్ తాగి వార్తల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చార్మినార్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. అక్క‌డ హీరో రామ్ తో పాటు చిత్ర‌యూనిట్ కూడా ఉంది. కానీ ఆ సాంగ్ లో భాగంగా బ‌హిరంగ ప్ర‌దేశంలో రామ్ సిగ‌రెట్ తాగాడు, అయితే చార్మినార్ లాంటి ప్రదేశంలో బహిరంగ ధూమపానం నిషిద్దం కాబట్టి పోలీసులు ఆయనకు జరిమానా విధించారు. అది కట్టాడు అనుకోండి అయితే ఇప్పుడు మళ్ళీ ఆ విషయం మీద క్లారిటీ ఇచ్చాడు ఈ నటుడు. ఈ విషయం మీద సోషల్ మీడియాలో స్పందించిన ఆయన ‘నా టైమూ పబ్లిక్‌ టైమూ వేస్ట్ చేయడం ఇష్టం లేక రెస్పాండ్ గాలే.. షాట్‌ల కాల్చిన తమ్మీ.. బ్రేక్‌ల కాద్‌.. టైటిల్‌ సాంగ్‌ల చూస్తవ్‌గా స్టెప్పు. ఫిర్‌ బీ లాకి ఇజ్జత్‌ ఇచ్చి ఫైన్‌ కట్టినం. గిప్పుడు నువ్వు కూడా నాలెక్క లైట్‌ తీస్కో పని చూస్కో’ ఇట్లు ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌  అంటూ ట్వీట్ చేశాడు రామ్‌. 

More Related Stories