English   

డబుల్ రేట్ పెట్టి ఇల్లు కొన్న తమన్నా...అందుకేనా ?

house
2019-06-25 19:18:21

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతని వేరేవాళ్ళు ఎలా అర్ధం చేసుకుంటారో తెలీదు కానీ సినిమా వాళ్ళు మాత్రం మహా బాగా అర్ధం చేసుకుంటారు. ముందుగా నిలదోక్కుక్కున్న సినిమా వాళ్ళు అందరూ ఒకటికి రెండు ఇళ్ళు కొని పడేస్తారు అవసరం ఉన్నా లేకున్నా. ఇప్పుడు అదే కోవలో నటి తమన్నా పయనిస్తోంది. తాజాగా తమన్నా ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో చాలా ఖరీదు పెట్టి ఒక ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న రేటు కంటే ఆమె పెట్టిన రేటు ఎక్కువట. బేవ్యూ అనే 22 అంతస్తుల ఆ భవంతిలో 14వ అంతస్తులోని ఒక ఫ్లాట్‌ను రూ.16.60 కోట్లకు తమన్నా కొనుగోలు చేసిందట. ఈ ఫ్లాట్‌ను తమన్నా, తల్లి రజనీ భాటియా పేర్ల మీద జాయింట్ వెంచర్‌గా కొనుగోలు చేసేందుకు తొమ్మిదిన్నర లక్షల కు స్టాంప్ డ్యూటీ కూడా కట్టారట. ఆ ప్రాంతంలో ఉన్న రేట్ కి తమన్నా పెట్టిన రేట్ రెండు రెట్ల అధికమట. కానీ  ఈ ఫ్లాట్‌లోంచి చూస్తే సముద్రం కనిపిస్తుందట. దీంతో ఆమెకి ఆ ఫ్లాట్ నచ్చడంతో డబుల్ రేట్‌ పెట్టి మరీ తమన్నా దానిని కొనుక్కుందట. ఇక ఈ ఇంటి ఇంటీరియర్ డిజైన్ కూడా రూ.2 కోట్లు పెట్టి చేయిస్తుందట.

More Related Stories