లయన్ కింగ్ లో కీలక పాత్రలకి డబ్బింగ్ చెప్పిన జగ్గూ భాయ్....రవిశంకర్

అడవిలో జంతువులు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుని స్నేహంగా ఉంటే ఎలా ఉంటుంది. నిజంగా అలా అవి ఉంటాయో లేదో కానీ అలా ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో డిస్నీ వాళ్ళు అప్పట్లోనే చాలా సిరీస్ డెవలప్ చేశారు. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఒక సింహం పేరు సింబ, సింబనే లయన్ కింగ్ కథకి హీరో, సింబతో పాటు టిమోన్ అనే ముంగిస పుంబా అనే అడివి పంది లయన్ కింగ్ కథలో లీడ్ రోల్స్. ఇక ఆ తర్వాత ఎన్తొహ్ డెవలప్ చేస్తూ చేస్తూ వచ్చి తాజాగా లయన్ కింగ్ 3డి ఆనిమేటెడ్ సినిమాగా జులై 19న విడుదలవుతోంది. ఇక ఈ సినిమాని భారతీయ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని అనుకుని బాలీవుడ్, టాలీవుడ్, అలాగే మిగతా బాషలలో స్టార్స్ చేత డబ్బింగ్ చెప్పిస్తున్నారు. హిందిలో కీలక ముసాఫాకు షారుక్,ముసాఫా తనయుడు సింబాకు షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పగా ఈ సినిమా తెలుగు వెర్షన్లో పుంబా పాత్రకు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం అలానే టీమోన్ పాత్రకు ఆలీ డబ్బింగ్ చెప్పారు. అయితే తెలుగులో స్కార్ పాత్రకి జగపతి బాబు డబ్బింగ్ చెప్పగా ముఫార్ పాత్రకి డబ్బింగ్ లో విశేష అనుభవం ఉన్న రవిశంకర్ చెప్పారు. ఇక ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా అన్ని ముఖ్య భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా దెబ్బకి డియర్ కామ్రేడ్ లాంటి సినిమా వాయిదా వేసుకునే పనిలో పడ్డారంటే ఈ సినిమా క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు.