English   

బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న మరో తెలుగు సినిమా 

 Karan Johar
2019-06-26 09:21:25

ప్రస్తుతం రీమేక్స్ సీజన్ నడుస్తోంది. వేరేవేరే బాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలని తమ బాషలలోకి రీమేక్ చేసి సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు కొందరు దర్శక నిర్మాతలు. అలా రీమేక్ అయిన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి కూడా, తాజాగా ఆలా రీమేక్ అయి కలెక్షన్ల సునామీ కురిపిస్తోంది అర్జున్ రెడ్డి రీమేక్ సినిమా. షహీద్ కపూర్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మొన్ననే రిలీజయి 100 కోట్ల మార్క్ వైపు దూసుకువెల్తోంది.. తాజాగా ఇప్పుడు మరో రీమేక్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్నీమధ్యన నాని హీరోగా  శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన జెర్సీ సినిమాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా ఆ సినిమాకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. అయితే ఆ సినిమాకి ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి కానీ వసూళ్ల పరంగా పెద్దగా లాభించలేదు.  అయితే మాత్రం సినిమాలో కంటెంట్ బాషకు సంబంధం లేకుండా ఎమోషనల్ గా ఉండడం, క్రికెట్ నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో జెర్సీ ని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి కరణ్ జోహార్ ముందుకు వచ్చాడట. నాని ప్లేస్ లో హీరోగా షాహిద్ కపూర్ ని అనుకుంటున్నాడట. కబీర్ సింగ్ హిట్ తో ఊపు మీద ఉన్న షాహిద్ కి జెర్సీ లాంటి సినిమా తగిచేస్తే బానే ఉంటుంది కానీ షాహిద్ కే రీమేక్ స్టార్ అని ముద్ర పడుతుందేమో మరి.

More Related Stories