English   

ఆ హీరోయిన్ బంపర్ ఆఫర్ కొట్టేసిందా ?

Madonna Sebastian
2019-06-26 09:33:02

మలయాళ ప్రేమమ్ సినిమాలో చివరికి హీరోని పెళ్లి చేసుకునే పాత్రలో నటించింది మడోన్నా సెబాస్టియన్. ఈ భామకి తెలుగులో అయితే అసలు అవకాశాలు రాలేదు ప్రేమమ్ తెలుగు రీమేక్ లో కూడా అదే పాత్ర చేసిన ఈమెకి తమిళ్ లో మాత్రం అవకాశాలు బానే వచ్చాయి. అలా సొంత బాష మలయాళంలో, తమిళ్ లో సినిమాలు చేసుకుంటోంది ఈ భామ. అయితే ఇంకా పెద్దగా క్రేజ్ రాని ఈమె బంపర్ ఛాన్స్ కొట్టేసినట్టు చెబుతున్నారు. అదేంటంటే ఆమె మణిరత్నం సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది. మణిరత్నం తన డ్రీం ప్రాజెక్ట్ గా చోళరాజుల కథను పొన్నియన్ సెల్వన్ అనే టైటిల్ తో రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈ సినిమాలో వివిధ భాషలకి చెందిన నటీనటులను తీసుకోనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దానికి ఊతం ఇచ్చేలాగా మణిరత్నంను మడొన్నా సెబాస్టియన్ కలవడంతో ఆమె పొన్నియన్ సెల్వన్‌ లో నటించనున్నారనే ప్రచారం మరింత గట్టిగా సాగుతోంది. మణిరత్నంను కలిసిన తర్వాత మడోన్నా సెబాస్టియన్‌ ఒక సెల్ఫీ దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ రోజు చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నానని, ఏమీ మాట్లాడలేను కానీ ఈ ఫొటో మాట్లాడుతుంది. నా మనసును అద్భుతమైన సినిమా వెంటాడుతోందని పెర్కొన్నది. దీంతో ఈ సినిమాలో ఈమె కూడా ఉందని అంటున్నారు. ఇప్పటి వరకూ ఈ సినిమా గురించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏదీ లేనప్పటికీ ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, ఐశ్వర్యరాయ్, మోహన్ బాబు, అనుష్కశెట్టి, అమలా పాల్ తదితరులు నటిస్తున్నట్టు ప్రచారం.

More Related Stories