మక్కల్ సెల్వన్ సరసనే ఛాన్స్ కొట్టేసిందా ?

హీరో నితిన్ పక్కన వరుసగా రెండు సినిమాలు చేసిన తమిళ పొన్ను మేఘా ఆకాష్ తెలుగులో తొలి రెండు సినిమాలు భారీ డిజాస్టర్ లు గా నిలవడంతో తెలుగులో ఉన్న సెంటిమెంట్ కారణంగా మేఘా ఆకాష్ కి అవకాశాలు లేకుండా పోయాయి. అయితే ఇప్పుడిప్పుడే ఆ పరాజయాల ప్రభావం తగ్గగా ఆమెకు తన మాతృబాష తమిళ్ లో అవకాశాలు పలకరిస్తున్నాయి. ఒకరకంగా మిగతా బాషల విషయంలో పెద్దగా ద్రుష్టి పెట్టని ఈమె తన మాతృ బాషలో మాత్రం నిలదొక్కుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఆమె ప్రయత్నాలు ఫలించాయో లేక అదృష్టం కలిసి వచ్చిందో తెలీదు కానీ మక్కల్ సెల్వన్ గా ఫేమస్ అయిన విజయ్ సేతుపతి సరసన హీరోయిన్ గా ఛాన్స్ లభించిందని ప్రచారం జరుగుతోంది. విజయ్ సేతుపతి తన 33వ సినిమాతో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. వెంకటకృష్ణ అనే డైరెక్టర్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో ముందుగా అమలా పాల్ ను హీరోయిన్ గా అనుకున్నారు. అయితే కొన్ని పర్సనల్ కారణాల వలన ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఆ అవకాశం మేఘా ఆకాష్ ను వరించిందట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈమె రజనీకాంత్ హీరోగా వచ్చిన పెట్టా సినిమాలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.