English   

పూరీకి భారీ టెన్షన్...నిజం అయితే పెద్ద దెబ్బే ?

Puri jagannadh
2019-06-26 11:57:46

తెలుగు సినిమా ఒకప్పటిలా లేదు, కధ-కధనం కొత్తగా ఉంది అనిపిస్తే కంటెంట్ మీద నమ్మకంతో ఎంత పెట్టడానికి అయినా నిర్మాతలు వెనకాడడంలేదు. నిజానికి రెగ్యులర్ ఫార్మాట్ కమర్షియల్ సినిమాలు అసలు మాయం అయ్యాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రేక్షకులు కూడా ఓకే మూస ధోరణితో కాకుండా మనసు పెట్టి సినిమాలు చూస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు హిట్ అయ్యాయి. అయితే తెలుగు సినిమాలలో గురించి ఇప్పుడు జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది. అదేంటి అంటే తెలుగులో ఇప్పుడు రెండు సినిమాలు ఒకే కాన్సెప్ట్ మీద తెరకేక్కుతున్నాయట. ఆ సినిమాలు బుర్రకధ, ఇస్మార్ట్ శంకర్. ఈ రెండు సినిమాల్లోని పాయింట్ ఒకటే అని ప్రచారం ఇప్పుడు కలకలంగా మారింది. బుర్రకథ సినిమాలో హీరోకి రెండు మెదళ్లు ఉంటాయని, ఎప్పుడు ఏ మెదడు పనిచేస్తే, ఆ వ్యక్తిలా హీరో మారిపోతుంటాడని ట్రైలర్స్ ద్వారా క్లారిటీ ఇచ్చినట్టయ్యింది. దాదాపు ఇదే పాయింట్ ను డబుల్ దిమాగ్ అంటూ పూరీ ఇస్మార్ట్ శంకర్ సినిమాను కూడా రిలీజ్ కి సిద్దం చేస్తున్నాడు. అయితే బుర్రకథ లైన్ ఏంటి అనేది మేకర్స్ ప్రకటించేశారు. కానీ ఇస్మార్ట్ శంకర్ మాత్రం మాస్ లుక్, తెలంగాణ యాసను  హైఅల్ట్ చేస్తూ అసలు విషయం దాచేస్తున్నార్నని అంటున్నారు. బుర్రకథ సినిమా ఈనెల 28న విడుదలవుతోండగా ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చేనెల 18న విడుదల చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ప్రచారం ప్రకారం సేమ్ పాయింట్ ఉంటే అది పూరి జగన్నాథ్ సినిమా మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. చూడాలి ఏమవనుందో ?
 

More Related Stories