మెగాస్టార్ కొరటాల సినిమాకి ముహూర్తం పెట్టారా ?

మెగాస్టార్ చిరంజీవిని స్వతంత్ర సమరయోధుడిగా తెరకెక్కుతున్న సినిమా సైరా. సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తవ్వడంతో గుమ్మడికాయ కొట్టేశారు. తెలుగునాడుకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధతో ఈ సినిమా తెరక్కుతోంది. ఇక ఈ సినిమా 2017 డిసెంబర్లో సైరా షూటింగ్ మొదలైంది. చిత్రీకరణ సమయంలో అనుకోని సమస్యలు తలెత్తడంతో సినిమా చాలా ఆలశ్యమైంది. ఇక ఈ సినిమాని అక్టోబరు 2న రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆగస్టు 22న ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్‌సేతుపతి, నయనతార, సుదీప్, అమితాబ్‌బచ్చన్, తమన్నా, జగపతిబాబు భారీ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తుండటంతో -సైరా ఎప్పుడొస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఒక కొలిక్కి రావడంతో ఇప్పుడు కొరటాలతో చిరంజీవి చేసే సినిమా మొదలు పెట్టె యోచనలో ఉన్నట్టు సమాచారం. బహుశా ఆగష్టులో ఏదైనా మంచి రోజున చూసో లేక ఆయన పుట్టిన రోజున కానీ సినిమా మొదలు పెట్టచ్చని అంటున్నారు.