English   

పాల్ బయోపిక్...ఆయనే హీరో

 Sunil
2019-06-26 14:50:22

గత ఏపీ ఎన్నికల్లో హాట్ హాట్ గా సాగిన ప్రచారంలో అప్పటి పాలక ప్రతిపక్షాల వాడీవేడీ విమర్శలలో కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది ఎవరయ్యా అంటే కేఏ పాల్ అని చెప్పక తప్పదు. అయితే ఈ ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆయన చేసిన చేష్టలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆయన కనిపిస్తే చాలు ఆ వీడియోకి వ్యూస్ వెల్లువలా వచ్చి పడేవి. అయితే అప్పట్లోనే ఆయన తన బయోపిక్ తెరకెక్కించడానికి హాలీవుడ్ డైరెక్టర్స్ క్యూ కడుతున్నారని చెప్పేవారు. ఆయన మాటలు నిజమయ్యి నిజంగానే ఆయన బయోపిక్ తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నయట. అయితే ఆయన చెప్పినట్టు అది హాలీవుడ్ లో మాత్రం కాదు, తెలుగులోనే. అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఒక కొత్త తెలుగు దర్శకుడు ఈయన బయోపిక్ తెరకేక్కిస్తున్నారట. అయితే ఈ సినిమాలో పాల్ గా సునీల్ నటిస్తున్నారని, ఆయనతో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా నటిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ సినిమా ఆయన మతప్రభోదకుడిగా ఉన్నప్పటి కధాంశం మేద ఉంటుందా లేక, ఆయన రాజకీయాల్లో ఎంటర్ అయ్యి చేసిన కామెడీ మీద బేస్ అయి ఉంటుందా అనేదే తేలాల్సి ఉంది. ఏది ఏమయినా ఆయన బయోపిక్ అంటే ఆ క్రేజే వేరని చెప్పచ్చు. చూడాలి ఏమి జరగనుందో ?

More Related Stories