English   

కల్కి సినిమా సెన్సార్ పూర్తి.. యు/ఎ సర్టిఫికెట్..

 Rajasekhar
2019-06-26 15:17:49

రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇంతకు ముందు ఈయన సినిమా వస్తుంది అంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు ప్రేక్షకులు. గడ్డం గ్యాంగ్ సినిమా వరకు కూడా రాజశేఖర్ సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోలేదు. కనీసం వచ్చి వెళ్లినట్లు కూడా తెలియదు. ఇలాంటి సమయంలో రెండేళ్ల కిందట విడుదలైన గరుడవేగ సినిమా కమర్షియల్ గా విజయం సాధించకపోయినా కూడా రాజశేఖర్ ఉన్నాడనే విషయాన్ని మాత్రం ప్రేక్షకులకు గుర్తు చేసింది. ఇదే నమ్మకంతో ఇప్పుడు కల్కి సినిమాను కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయిపోయాయి. సినిమాలో యాక్షన్ పార్ట్ కాస్త ఎక్కువగా ఉండటంవల్ల యు బై ఎ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. హీరోయిన్ల గ్లామర్ షో లేకపోయినా కూడా యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రం భారీగానే ఉన్నాయి. 1983 తెలంగాణ కొల్లాపూర్ ప్రాంతంలో జరిగిన కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ట్రైలర్ లోనే ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. మర్డర్ మిస్టరీ గా కల్కి సినిమా తెరకెక్కింది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు ట్రైలర్ కూడా యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తుండటంతో ఆసక్తి పెరిగి పోతుంది. కచ్చితంగా ఈ సినిమాతో కమర్షియల్ గా కూడా విజయం సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు రాజశేఖర్. దానికి తగ్గట్లుగానే ట్రైలర్ కూడా ఉండటంతో చిత్ర యూనిట్ కూడా ధైర్యంగా కనిపిస్తోంది. ట్రైలర్ ఈవెంట్ లో కూడా సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని చెప్పాడు రాజశేఖర్. తన కూతుళ్ళు ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్న విధానం కూడా తనకు చాలా బాగా నచ్చింది అంటున్నాడు ఈ సీనియర్ హీరో. మొత్తానికి మర్రి రాజశేఖర్ కల్కి సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నాడో జూన్ 28న తేలనుంది.

More Related Stories