English   

కుర్ర హీరోలను మహేష్ ఎందుకు నమ్ము కుంటున్నాడు..

Nani
2019-06-26 15:26:33

మహేష్ బాబు కి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు వంద కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తున్నాయి ఇప్పుడు. మొన్న విడుదలైన మహర్షి సినిమా కూడా యావరేజ్ టాక్ తో మొదలై 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆయనకు ఆయనే సాటి.. ప్రత్యేకంగా ఆయనకు మరొకరు ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మహేష్ బాబు ఉన్నాడనే ఒక మాట తోనే అభిమానులు థియేటర్లకు క్యూ కడతారు. రికార్డులు కూడా వాటంతటవే నడుచుకుంటూ సూపర్ స్టార్ చెంతకు వస్తాయి. ఇలాంటి హీరోలకు మరో హీరో వచ్చి ప్రమోషన్ చేయాల్సిన అవసరం కానీ.. ఆవశ్యకత కానీ లేదు. కానీ ఇప్పుడు మహేష్ బాబు మాత్రం కుర్ర హీరోలను నమ్ముకున్నాడు. ఆ మధ్య మహర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు సూపర్ స్టార్. అప్పట్లో అది చాలా పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ఏంటి విజయ్ దేవరకొండ లాంటి కుర్ర హీరో అతిథిగా పిలవడం ఏంటి అనుకున్నారు.. ఇక ఇప్పుడు మహర్షి సినిమా 50 రోజుల వేడుక న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా రానున్నాడు. శిల్పకళా వేదికలో ఈ వేడుక జరగబోతుంది. అభిమానుల సమక్షంలో తన 25వ సినిమా 50 రోజుల వేడుక ఘనంగా జరుపుకోవడానికి ప్లాన్ చేసుకున్నాడు మహేష్ బాబు. ఇక ఈ వేడుకకు నాని వస్తే బాగుంటుందని మహేష్ బాబు ఫీలయ్యాడు. దాంతో దిల్ రాజు కూడా వెంటనే నాచురల్ స్టార్ నాని ని లైన్ లో పెట్టేసాడు. అయితే దీని వెనుక ఒక కారణం ఉందని చెబుతున్నారు సినిమా విశ్లేషకులు. మహేష్ బాబు ఇప్పుడు సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. అందులో భాగంగానే అడవి శేష్ హీరోగా మేజర్ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు సూపర్ స్టార్. ఇక ఇప్పుడు నాని, విజయ్ దేవరకొండ లాంటి కుర్ర హీరోలతో సినిమాలు నిర్మించడానికి మహేష్ ఆసక్తి చూపిస్తున్నాడు. దాంతో వాళ్ళ డేట్స్ కావాలంటే సన్నిహితంగా ఉండాలి కాబట్టి తన సినిమాల వేడుకలకు పిలుస్తున్నాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఏది నిజం అనేది ప్రస్తుతానికి పక్కన పెట్టిన తన ఇదిగో పట్టించుకోకుండా స్టార్ ఇమేజ్ వదిలేసి తనకంటే తక్కువ ఇమేజ్ ఉన్న హీరోలను వేడుకలకు పిలవడం మాత్రం మహేష్ బాబు చేస్తున్న ఒక గొప్ప పని. ఇదే ఆనవాయితీ ఇతర హీరోలు కూడా పాటిస్తే ఇండస్ట్రీలో సమానత్వం వస్తుంది అంటున్నారు విశ్లేషకులు.
 

More Related Stories