English   

ఈ శుక్రవారం కొత్త సినిమాలు.. కుర్ర హీరోలతో రాజశేఖర్ పోటీ..

Rajasekhar
2019-06-26 15:46:44

శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడిపోతాయి. ఈసారి కూడా ఇదే జరగబోతుంది. అయితే కొన్ని రోజులుగా పేరున్న సినిమాలేవీ థియేటర్ లలో కనిపించడం లేదు. గత వారం విడుదలైన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మల్లేశం సినిమాలకు మంచి టాక్ వచ్చింది. ఇందులో మల్లేశం కమర్షియల్ గా వెనకబడిన కూడా ఆత్రేయ మాత్రం మంచి వసూళ్లు తీసుకొస్తుంది. ఇక ఈ వారం కూడా దాదాపు అరడజను సినిమాలు విడుదల కానున్నాయి. అందులో అందరి దృష్టి రాజశేఖర్ నటించిన కల్కి సినిమాపైనే ఉంది. గరుడవేగ తర్వాత ఆయన చేసిన సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. జూన్ 28న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ఈ సినిమాతో పాటు మరో మూడు నాలుగు సినిమాలు కూడా ఈ శుక్రవారం విడుదల కానున్నాయి. ఆది సాయి కుమార్ హీరోగా నటించిన బుర్రకథ కూడా ఆసక్తి పెంచేస్తుంది. మొన్నటి వరకు ఈ సినిమా గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. ఒక మనిషిలో రెండు మెదళ్ళు ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ చిత్ర కథ. ఆయనకు ఆయనే శత్రువు అనే కాన్సెప్టుతో ఈ సినిమాని తెరకెక్కించాడు డైమండ్ రత్నబాబు. మెంటల్ మదిలో సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ వారం బ్రోచేవారెవరురా అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శ్రీ విష్ణు, నివేద థామస్, నివేదా పేతురాజ్ ఈ సినిమాలో నటించారు. ఇక హరినాథ్ పొలిచెర్ల నటించిన రాణా ప్రతాప్ కూడా ఈ వారమే విడుదల కానుంది. మొత్తానికి దాదాపు అరడజను సినిమాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. మరి వీటిలో దేనికి ప్రేక్షకులు ఓటేస్తారో చూడాలి.

More Related Stories