English   

అనిల్ రావిపూడికి ఊహించని షాక్ ఇచ్చిన మహేష్ బాబు..

 Mahesh
2019-06-26 19:00:44

మహేష్ బాబు విదేశాల నుంచి ఎప్పుడెప్పుడు వస్తాడా.. ఎప్పుడెప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాను మొదలు పెడదామా అని వేచి చూస్తున్నాడు అనిల్ రావిపూడి. దీని కోసం రెండు నెలలుగా స్క్రిప్టు సిద్ధం చేసుకుంటున్నాడు ఈయన. అన్నీ పూర్తి చేసుకుని మహేష్ బాబు రావడమే ఆలస్యం.. వచ్చిన వెంటనే సినిమా మొదలు పెట్టి చాలా వేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ కుర్ర దర్శకుడు. దీనికోసం షెడ్యూల్స్ కూడా సిద్ధం చేసుకొని ఉన్నాడు ఈయన. కేవలం ఆరు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తిచేసి సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇలాంటి సమయంలో మహేష్ బాబు మాత్రం విదేశాల నుంచి రాగానే సినిమా షూటింగ్ కాకుండా ఎండార్స్ మెంట్ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఫారిన్ నుంచి వచ్చి రాగానే యాడ్స్ షూటింగ్ పూర్తి చేశాడు సూపర్ స్టార్. వాటి కోసమే నాలుగు రోజులు కేటాయించాడు. ఇక్కడ ఇంతగా దర్శకుడు వేచి చూస్తూ ఉంటే ఆయన మాత్రం కమర్షియల్ యాడ్స్ పూర్తి చేసుకుని వచ్చి ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు షూటింగ్ కు సిద్ధం కానున్నాడు. ముందు నుంచి మహేష్ బాబు ఈ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. తాను ఒప్పుకున్న కమర్షియల్ యాడ్స్ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఇక ఎలాంటి టెన్షన్ లేకుండా సరిలేరు నీకెవ్వరు సినిమాను పూర్తి చేయనున్నాడు సూపర్ స్టార్. అందుకే ఆ సినిమా షూటింగ్ మొదలు కాకముందే ఇది పూర్తి చేసేసాడు. ఇక్కడి నుంచి మరో ఆరు నెలల వరకు మహేష్ బాబుకు అనిల్ రావిపూడి తప్ప మరో ధ్యాస లేదు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు మహేష్ బాబు. విజయశాంతికి కీలక పాత్రలో నటిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించబోతోంది. కనీసం షూటింగ్ కూడా మొదలు కాకముందే ఈ సినిమాలో జెమిని ఛానల్ 16.5 కోట్లకు శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది. జులై 5న సరిలేరు నీకెవ్వరు మొదటి షెడ్యూల్ మొదలుకానుంది.

More Related Stories