English   

వీవీ వినాయక్ ఇంటిని కూల్చివేసిన అధికారులు

vv
2019-06-27 07:26:10

తెలుగు రాజకీయాల్లో నిన్నంతా హాట్ టాపిక్ ప్రజావేదిక కూల్చివేత, గత ప్రభుత్వం దానిని అక్రమంగా మొదలుపెట్టిందని పేర్కొంటూ ప్రస్తుత జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కూల్చివేతలానే వీవీ వినాయక్ కట్టుకుంటున్న ఇంటిని కూడా అధికారులు కూల్చి వేసి ఆయనకు షాక్ ఇచ్చారు. ఆయన రాజేంద్రనగర్ తాలూకా గండిపేట చెరువుకు దగ్గరలో ఒక ఇంటిని కట్టుకుంటున్నారు. అయితే దానిని నిన్న అధికారులు కూల్చి వేశారు. ఆయన నిర్మించుకుంటున్న భవంతిని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. నిర్మాణ పనులు పూర్తయ్యాక గృహ ప్రవేశం చేసి ఆ ఇంట్లో నివాసం ఉండేందుకు వెళ్ళాలని వీవీ వినాయక్ అనుకున్నారు. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్టు అనుమతి లేదనే పేరుతో అధికారులు ఆ ఇంటిని కూల్చేశారు. నిజానికి వట్టినాగులపల్లి గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుంది. కానీ ఈమధ్య కాలంలో వజ్రాలపల్లిని మున్సిపాలిటీగా అధికారులు బదిలీ చేశారు. దీంతో ఈ ప్రాంతం పూర్తిగా త్రిపుల్ వన్ జీవో పరిధిలోకి వస్తోంది. ఇక్కడ జీ+2 మాత్రమే నిర్మించాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు అనుమతించరు. కానీ వీవీ వినాయక్ జీ+6 భవంతిని నిర్మాణానికి పూనుకున్నారు. జీవో 111కు విరుద్ధంగా నిర్మాణం చేపట్టడంతో అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. డైరెక్టర్ నుంచి స్పందన లేకపోవడంతో ఆ భవనంలోని నాలుగు అంతస్థులను అధికారులు కూల్చివేశారు.

 

More Related Stories