English   

చిరంజీవి సినిమా కోసం కొత్త భామ

chiru
2019-06-27 07:45:51

రాజకీయాల్లో లక్ చెక్ చేసుకుని అక్కడ వర్కవుట్ కాక మళ్ళీ సినిమాలు చేస్తున్న ఆయన రెండేళ్ళ క్రితం ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి బంపర్ హిట్ కొట్టారు. ఇక ఆయన చేస్తున్న ప్రస్తుత సినిమా సైరా నరసింహారెడ్డి షూటింగ్‌ మొన్ననే పూర్తి కాగా ప్రస్తుతం ఆ సినిమా డబ్బింగ్ అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా డబ్బింగ్ పూర్తయ్యాక కొద్దిరోజులు ఆగి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలోనే కాస్త ఉత్కంట కొనసాగుతోంది. ఇప్పటిదాకా ఈ సినిమాలో ఆయన సరసన నయనతార లేదంటే శృతిహాసన్‌ను తీసుకోవాలని కొరటాల చూస్తున్నట్లు ప్రచారం జరిగినా తాజాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన కొత్త హీరోయిన్‌ను తీసుకోవాలని కొరటాల శివ ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మెగాస్టార్ ఇమేజ్‌కు సరిపోయే కొత్త ముఖం కోసం కొరటాల వెతుకుతున్నారని అంటున్నారు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌ మీద రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. 

More Related Stories