English   

సాహో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఆ సంస్థకే ?

Saaho
2019-06-27 14:03:02

బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తోన్న భారీ బడ్జెట్ సినిమా సాహో. ఆ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక బాహుబలి దెబ్బకి ప్రభాస్ క్రేజ్ వరల్ద్ వైడ్ ఫేమస్ అవగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు సాహో సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కానుంది. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా అగ‌స్ట్ 15న ప్రపంచ‌ వ్యాప్తంగా సాహో భారీ విడుదలకు సిద్ధమవుతోన్న నేపధ్యంలో ఈ సినిమా షూటింగ్ త్వరితగతిన పూర్తి చేస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమాలో సాంగ్స్ షూటింగ్ జరుపుకుంటుంది. ఆస్ట్రియాలో ఆల్ప్స్ పర్వత శ్రేణి వద్ద ఉన్న టైరోల్ స్టేట్ లో షూటింగ్ కు అనువుగా చాలా అద్భుతమైన సీనరీలు ఉంటాయి ప్రస్తుతం అక్కడే ఈ సాహో షూటింగ్ చేస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్  రైట్స్ ను ఫర్స్ ఫిల్మ్స్ సంస్థ దక్కించుకున్నట్టు చెబుతున్నారు. ఒక్క మిడిల్ ఈస్ట్ మినహా మిగతా అన్ని చోట్లా యశ్ రాజ్ ఫిలిమ్స్ వారితో కలిసి ఫర్స్ ఫిల్మ్స్ విదేశాల్లో తెలుగు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు అదే సంస్థ సాహో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు సొంతం చేసుకుందని అంటున్నారు. దీని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

More Related Stories