కన్నడలోకి కూడా అర్జున్ రెడ్డి

తెలుగులో పెద్దగా అంచనాలు లేకుండానే రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలియనిది కాదు. ఆ క్రేజ్ తో ఈ సినిమాని వేరే బాషలలోకి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాని బాలీవుడ్ లోకి కబీర్ సింగ్ గా రీమేక్ చేసి రిలీజ్ చేయగా అది సెంచరీ కొట్టి మరిన్ని రికార్డుల వైపు దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాని తమిళంలో ఆదిత్య వర్మ అనే టైటిల్ తో రూపొందిస్తున్నారు. గతంలో బాలా దర్శకత్వంలో వర్మ పేరుతో ఈ సినిమా చిత్రీకరించగా అది సరిగా రాలేదని చెబుతూ దర్శకుడిని తప్పించి మళ్లీ రీషూట్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా ఇటీవలే ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఇంత క్రేజ్ ఏర్పడింది కాబట్టే ఈ సినిమాని అర్జున్ రెడ్డి చిత్రాన్ని కన్నడలోను రీమేక్ చేయాలని అక్కడి మేకర్స్ భావిస్తున్నారట. ప్రముఖ కన్నడ డైరెక్టర్ ఎస్.నారాయణ్ రీసెంట్గా అర్జున్ రెడ్డి కన్నడ రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు. ఇక ఈ సినిమా స్క్రిప్టింగ్ వర్క్ ప్రస్తుతం జరుగుతున్నదని చెబుతున్నారు. ఈ పనులు పూర్తయ్యాక ఈ సినిమా మొదలు పెట్టనున్నారట. అంతేకాక ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి డీటైల్స్ని త్వరలోనే వెల్లడించనున్నారని అంటున్నారు.