నాగ్ తో విక్రమ్...మరో క్రేజీ కాంబో

గత కొంత కాలంగా హిట్స్ లేని నాగార్జున ప్రస్తుతం ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నారు. ఆయన ఇప్పటికే తన గత సినిమాలకి సీక్వెల్స్ ఒప్పుకున్నాడు. ప్రస్తుతం మన్మధుడు సినిమాకి సీక్వెల్ గా వస్తున్న మన్మధుడు సినిమాలో ఆయన నటిస్తున్నాడు. ఈ సినిమాని చిలసౌ సినిమాతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్త్జి అయ్యాక సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ప్రీక్వెల్‌గా బంగార్రాజు చేయనున్నాడు. అయితే మరో నెలలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 3లో ఆయన హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇక ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మరో సినిమాకి ఓకే చెప్పినట్టు సమాచారం. ఆ దర్శకుడు ఎవరో కాదు విక్రమ్ కుమార్, మనం సినిమాతో అక్కినేని కుటుంబానికి ఒక మరపురాని స్పెషల్ మూవీని ఇచ్చాడు విక్రమ్. ఆ తర్వాత అఖిల్‌తో హలో తీస్తే అది వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు తాజాగా అయన నాగ్ ని కలిసి ఒక లైన్ చెప్పారని ఆ లైన్ ఆ బాగా నచ్చడంతో వెంటనే డెవలప్ చేయమని నాగ్ విక్రమ్ కి చెప్పాడని సమాచారం. ప్రస్తుతం నాని హీరోగా చేస్తోన్న గ్యాంగ్‌లీడర్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న విక్రమ్ ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి నాగార్జునకి చెప్పిన లైన్ డెవలప్ చేసే పనిలో పడతారని సమాచారం. అంతా సవ్యంగా జరిగితే అన్నపూర్ణ సినిమాస్ బ్యానర్ మీద నిర్మాణమయ్యే ఈ సినిమా వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం అవుతోందట.