English   

సూర్య సినిమాకు రాజ‌మౌళి టైటిల్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్.. 

 Kaappan
2019-06-27 17:41:27

ఈ మ‌ధ్య కాలంలో వ‌ర‌స ప‌రాజ‌యాల‌తో పూర్తిగా ఇమేజ్ పాడు చేసుకున్నాడు సూర్య‌. ఒక‌టి రెండు కాదు.. మొన్నొచ్చిన ఎన్జీకే సినిమాతో ఏకంగా అర‌జ‌డ‌న్ ఫ్లాపులు పూర్తిచేసాడు ఈ హీరో. వ‌ర‌స ఫ్లాపులు ఇస్తుండ‌టంతో తెలుగులో ఈయ‌న మార్కెట్ కూడా భారీగా ప‌డిపోయింది. ఒక‌ప్పుడు 15 కోట్లున్న సూర్య మార్కెట్ ఇప్పుడు క‌నీసం 4 కోట్లు కూడా లేదు. ఎన్జీకే కూడా దారుణంగా ఫ్లాప్ కావ‌డంతో ఇప్పుడు అర్జంటుగా హిట్ కొట్టాల్సిన ప‌రిస్థితుల్లో ప‌డిపోయాడు ఈ హీరో. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేవీ ఆనంద్ సినిమాపై అంచ‌నాలు, ఆశ‌లు పెట్టుకున్నాడు ఈయ‌న‌. ఈ కాంబినేష‌న్ లో గ‌తంలో వ‌చ్చిన వీడొక్క‌డే సంచ‌ల‌న విజ‌యం సాధించింది. అయితే ఆ త‌ర్వాత చేసిన బ్ర‌ద‌ర్స్ ఫ్లాప్ అయింది. ఇక ఇప్పుడు మూడోసారి కాప్ప‌న్ సినిమా కోసం క‌లిసి ప‌ని చేస్తున్నారు ఈ జోడీ. ఇందులో మోహ‌న్ లాల్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఆర్య‌, స‌యేషా కూడా ఉన్నారు. ఈ సినిమాకు తెలుగు టైటిల్ రాజ‌మౌళి ప్ర‌క‌టించ‌నున్నాడు. జూన్ 27 ఉదయం 10.30 నిమిషాలకు రాజ‌మౌళి ఈ చిత్ర టైటిల్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో అనౌన్స్ చేసాడు ద‌ర్శ‌కుడు కేవీ ఆనంద్. ఈ చిత్రంతో హిట్ కొట్టి మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తానంటున్నాడు సూర్య‌. ఈయ‌న కెరీర్ కు కూడా కేవీ ఆనంద్ సినిమా కీల‌కంగా మారింది. మ‌రి చూడాలిక‌.. సూర్య క‌నీసం ఈ చిత్రంతోనైనా విజ‌యం అందుకుంటాడో లేదో.. రాజ‌మౌళి చేయి ఈయ‌న‌కు క‌లిసొస్తుందో లేదో..? 

More Related Stories