English   

సంక్రాంతికి ఇంకా ఎంత‌మంది వ‌స్తారు బాబూ.. బ‌న్నీ కూడానా..?

alluarjun
2019-06-27 20:15:50

సంక్రాంతి సీజ‌న్ వ‌చ్చిందంటే చాలు.. వ‌ర‌స‌గా సినిమాలు వ‌చ్చేస్తుంటాయి. ఈ సారి కూడా ఇదే జ‌రుగుతుంది. 2019 సంక్రాంతికి నాలుగు సినిమాలు వ‌చ్చాయి. అందులో ఎఫ్ 2 సినిమా మాత్ర‌మే విజ‌యం సాధించింది. ఆ సినిమాతో పాటు వ‌చ్చిన విన‌య విధేయ రామ‌, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, పేట సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఒకేసారి ఇన్నిసినిమాలు రావ‌డం కూడా దీనికి శాపంగా మారిపోయింది. ఇక ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. 2020 సంక్రాంతికి కూడా నాలుగు సినిమాలు రానున్నాయి. అందులో అంతా స్టార్ హీరోలే ఉండ‌టం విశేషం. ఇప్ప‌టికే బాల‌య్య త‌ను కేయ‌స్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమా సంక్రాంతికి వ‌స్తుంద‌ని చెప్పాడు. షూటింగ్ కూడా జులైలో మొద‌లు పెట్ట‌నున్నాడు. ఇక నాగార్జున కూడా బంగార్రాజు సినిమాతో పండ‌క్కే రానున్నాడు. ఇదిలా ఉంటే మ‌హేష్ బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు కూడా సంక్రాంతి పండ‌క్కే రానుంది. ఈ సినిమాను జ‌న‌వ‌రి 15న విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు దిల్ రాజు. ఆయ‌న‌కు ఆతేదీ కూడా బాగానే క‌లిసొచ్చింది. ఇక ఇప్పుడు బ‌న్నీ కూడా సంక్రాంతికే రావాల‌ని ప్లాన్ చేసుకుంటున్నాడు. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తెర‌కెక్కిస్తున్న సినిమాను పండ‌క్కి విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. పూజాహెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఒకేసారి నాలుగు పెద్ద సినిమాలు వ‌స్తే క‌చ్చితంగా అది క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం చూపిస్తుంద‌ని తెలిసినా కూడా ఎవ‌రికి ఎవ‌రూ త‌గ్గ‌డం లేదు. మ‌రి చూడాలిక‌.. చివ‌రివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో..?

More Related Stories