English   

ఆది బుర్ర కధ వాయిదా...ఎందుకంటే ?

katha
2019-06-27 20:42:57

సాయికుమార్ కుమారుడు హీరో ఆది సాయికుమార్, మిష్టీ చక్రవర్తి, నైరా షాలు హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా బుర్రకథ. ఈ సినిమాతో డైలాగ్ రైటర్ గా ఫేమస్ అయిన రచయిత డైమండ్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అయితే విభిన్న కధాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్ లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే దాదాపు అన్ని పనులూ ఇప్పటికే పూర్తి కావడంతో ఈ సినిమాని రేపు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే అన్నీ అనుకున్నవి అనుకున్నాట్టు జరిగితే రిలీజ్ అయ్యేదేమో కానీ అసలైన సెన్సార్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా వాయిదా పడింది. రేపు రిలీజ్ కావాల్సిన సినిమా ఎల్లుండి రిలీజ్ చేస్తామని ఆ సినిమా యూనిట్ ప్రకటించింది.  నిజానికి రేపు మూడు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది, రాజశేఖర్ హీరోగా వస్తున్న కల్కి సినిమా, శ్రీ విష్ణు హీరోగా వస్తున్న బ్రోచెవారెవరురా సినిమాలు కూడా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ రెండు సినిమాలు ఇప్పటికే రిలీజ్ కి సిద్దమవగా ఈ సినిమాకి మాత్రం అనుకోని బ్రేక్ పడింది. ఇప్పుడు విజయ నిర్మల మృతితో ఎల్లుండికి అయినా సెన్సార్ అవుతుందా ? అంటే కష్టమనే అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories