English   

బాలీవుడ్ నటుడి మీద రేప్ కేసు పెట్టిన కంగనా

Aditya Pancholi
2019-06-28 09:51:06

బాలీవుడ్ నటుడు, నిర్మాత ఆదిత్యపంచౌలీపై ముంబై వెర్సోవా పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు నమోదైంది.  ఆదిత్య పంచోలి తనపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని వివాదాస్పద నటి కంగనా రనౌత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదిత్యాపంచోలీపై  ఐపీసీ సెక్షన్ 376, 328, 384, 341, 342, 323, 506ల కింద కేసులు నమోదు చేశారు. కొన్నాళ్లుగా కంగనా రనౌత్, ఆదిత్యా పంచోలీ మధ్య ఏర్పడిన ఒక వివాదం రోజురోజుకీ పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఆదిత్యాపంచోలి గతంలో కంగనా రనౌత్‌ మీద వేధింపులకు పాల్పడ్డాడని కంగనా సోదరి రంగోలీ వెర్సోవా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో కంగనా తరపు లాయర్ తనను అత్యాచార కేసులో ఇరికిస్తానని తనపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని మరోవైపు ఆదిత్యాపంచోలి కూడా పీఎస్‌లో గతంలో కౌంటర్ అప్లికేషన్ దాఖలు చేశాడు. అయితే తాజాగా మళ్ళీ తాను 17 ఏళ్ల వయసులో ఉండగా ఆదిత్య పలుమార్లు వేధింపులకు గురిచేశాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా హెచ్చరించి వదిలేశారని పేర్కొంది. కాగా పదేళ్ల క్రితం కేసు కాబట్టి కేసు నమోదు చేసినా దానిని నిరూపించడం, ఆధారాలు సేకరించడం కష్టమేనని పోలీసులు పేర్కొంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ? 

More Related Stories