English   

విజయనిర్మల మరణం వెనుక మరో కారణం ?

Vijaya Nirmala
2019-06-28 10:12:30

తెలుగు సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు  స్వయానా రాసుకున్న నటి, అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్‌రికార్డును సాధించిన విజయనిర్మల నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. బాల్యం నుండే సినీ నట జీవితం ప్రారంభించిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. అయితే ఆమె అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. విజయనిర్మల మృతివార్తను ముందుగా ఆమె కుమారుడు, సినీనటుడు నరేశ్ ట్విటర్‌లో వెల్లడించారు. అయితే మీడియాకి ఆమె హార్ట్ ఎటాక్ తో మరణించినట్టు సమాచారం అందింది. కానీ ఆమె మృతి వెనుక వేరే కారణం ఉందని అంటున్నారు. నిజం ఎంతో తెలీని ఈ ప్రచారం మాత్రం విస్తృతంగా జరుగుతోంది. అదేంటంటే ఆమె మరణానికి కారణం క్యాన్సర్ అని. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజమనే విధంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు కావాలని దాచి పెట్టారని, క్యాన్సర్ అని తెలిస్తే ప్రజలు, ప్రముఖులు ఆమెను పరామర్శించేందుకు క్యూ కడతారని, క్యాన్సర్ తో బాధ పడే వారికి ధైర్యం చెప్పేవారు కావాలి కానీ ఇలా పరామర్శకి వస్తే మరింత క్రుంగిపోయే అవకాశం ఉందని తెలియడంతో ఈ విషయాన్ని బయట పెట్టలేదని అంటున్నారు. ఇందులో నిజం ఎంతుందనేది దేవుడికే ఎరుక. ఇక ఈరోజు ఉదయం ఆమె అంత్యక్రియలు వారి సొంత ఫాం హౌస్ లో జరగనున్నాయి.

More Related Stories