విజయకృష్ణా గార్డెన్స్ లో అంత్యక్రియలు...ఫిలిం చాంబర్ కి పార్ధివ దేహం

అలనాటి నటి, దర్శకురాలు, నిర్మాత విజయ నిర్మల బుధవారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె పార్ధివ దేహాన్ని నానక్ రామగూడలోని ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లోని ఆమె ఇంటికి తీసుకు వెళ్లారు. నిన్న అంతా ఆమె కాయాన్ని స్వగృహంలోనే ఉంచారు. పలువురు ప్రముఖులతో పాటు ఆమె కుటుంబ సభ్యులు విజయ నిర్మల భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్స్‌లో విజయ నిర్మల అంత్యక్రియులు నిర్వహించనున్నారు. అభిమానుల కోసం పార్థివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్లో ఉంచి ఆ తర్వాత అంత్యక్రియలు జరపాలని అనుకున్నా తర్వాత నిర్ణయం మార్చుకుని ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకు రాకుండా నేరుగా విజయకృష్ణ గార్డెన్స్‌కే తీసుకెళ్లి అంత్యక్రియలు జరపాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే మళ్ళీ ఏమైందో తెలీదు కానీ మళ్ళీ ఆమె భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్‌కు విజయనిర్మల భౌతికకాయాన్ని తరలించనున్నారు. అనంతరం 9 గంటలకు విజయనిర్మల అంతిమయాత్ర అక్కడి నుండి ప్రారంభించనున్నారు. 11 గంటలకు చిలుకూరు విజయకృష్ణ గార్డెన్స్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక ఈ అంత్యక్రియల్లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు.