English   

దాసరి కుటుంబంలో కలకలం రేపుతున్న వరుస మిస్సింగ్ లు 

Dasari
2019-06-28 10:49:25

ఒకప్పుడు టాలీవుడ్‌ పెద్దదిక్కులా ఉండి ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా తాను ఉన్నానని అండగా ఉంటూ వారి సమస్యలు తీర్చిన వ్యక్తి దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు. అయితే ఇప్పుడు ఆయన కుటుంబానికి సంబంధించి వస్తున్న వార్తలు ఆయన పేరుకు మాయని మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో దాసరి పెద్ద కుమారుడు దాసరి ప్రభు తన నివాసం నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోవటంతో ఆయన రెండో భార్య, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరపడం ఈలోపు ప్రభు స్వయంగా వెళ్లి పోలీసుల దగ్గరకి వెళ్లి హాజరు కావడం తెలిసిందే. ఇక తాజాగా ఆయన పెద్ద భార్య సుశీల, ఆమె తల్లి సావిత్రమ్మలు కనిపించకుండా పోయారని చెబుతూ దాసరి కోడలి చెల్లెలు తన సోదరి, తన తల్లి కనిపించటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె చిత్తూరు జిల్లా పూతల పట్టులో ఉంటారు. దీంతో ఆమె అక్కడి పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే ప్రభు పోలీసుల దగ్గరకి వెళ్ళినప్పుడు తనను తన పెద్ద భార్య కొంతమందితో కలిసి కిడ్నాప్‌ చేసి ముంబై తీసుకెళ్లారని చెప్పడంతో పోలీసులు మిస్సింగ్ కేసు మూసేసి అతడిని ఇంటికి పంపేశారు. అయితే ఆయన ఆరోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన రోజే పెద్ద భార్య సుశీల, ఆమె తల్లి సావిత్రమ్మను ఆయనే మసబ్‌ ట్యాంక్‌లోని ఓ హోటల్‌లో దించినట్లు సుశీల సోదరి చిన్నమ్మ పూతలపట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మసబ్‌ట్యాంక్‌ నుంచి ప్రభు వెళ్లిపోయిన తరువాత తన సోదరి, తల్లి ఇంటికి రాలేదని వారి ఆచూకీ దొరకడం లేదని చెప్పడంతో అక్కడి పోలీసులు రెండు రోజులుగా  హైదరాబాద్‌లో గాలింపు చేపట్టారు. 

More Related Stories