English   

బందోబస్త్ తో వస్తున్న సూర్య...జక్కన్న ప్రకటన 

Suriya
2019-06-28 11:56:15

సూర్య హీరోగా రూపొందిన తాజా చిత్రం కాప్పాన్. విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సూర్య ఈ సినిమాలో పీఎంకి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. కె.వి.ఆనంద్ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా తెలుగు వర్షన్ ఫస్ట్ లుక్ ని జక్కన్న రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. నిజానికి ఈ ఫస్ట్ లుక్, టైటిల్ నిన్ననే రిలేజ్ చేయాల్సి ఉన్నా విజయ నిర్మల మృతితో అ రిలీజ్ ఈ రోజుకి వాయిదా పడింది. తమిళలో కాప్పాన్ పేరుతో వస్తున్న ఈ సినిమాని తెలుగులో బందోబస్త్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. సూర్యతో 'వీడొక్కడే', 'బ్రదర్స్' వంటి చిత్రాలను తెరకెక్కించిన కె.వి.ఆనంద్ దర్శకత్వంలో వస్తుండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. సూర్యతో పాటు మోహన్ లాల్, ఆర్యలు ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాప్పాన్ అంటే తమిళంలో కాపలాదారుడు అని అర్థం. అందుకే తెలుగులో కూడా బందోబస్త్ అని పేరు పెట్టారు. ఇక ఈ సినిమాలో ప్రధానమంత్రిగా కనిపించే మోహన్‌లాల్‌కి.. సూర్య అంగరక్షకుడు పాత్రలో ప్రొటెక్టర్‌గా కనిపించనున్నాడట. ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా ఆగస్టు 30న రిలీజ్ కానుంది.

More Related Stories