English   

కల్కి మూవీ రివ్యూ

Kalki Review
2019-06-28 18:42:43

రొటీన్‌కు భిన్నంగా క్రియేటివ్ కథలతో సినిమాలు తెరకెక్కించే దర్శకులు తెలుగు సినీ పరిశ్రమలో చాలా తక్కువ. అలా రొటీన్ కి భిన్నంగా ఒక అ సినిమాతో ప్రశాంత్ వర్మ తానెంటో నిరూపించుకున్నారు. దీంతో ఆయన తరవాత ప్రాజెక్ట్‌పై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. అందునా రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోను పెట్టి ‘కల్కి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో సినిమా తెరకెక్కించడంతో సాధారణంగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇక ఈ సినిమా ట్రైలర్స్, టీజర్స్ చూశాక మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. 

కధ : 
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా నిజాం సామ్రాజ్యం చాన్నాళ్ళు ఉండేది. ఆ నిజాం రాజ్యంలోని కొల్లాపూర్‌ సంస్థానంలో జరిగిన కొన్ని సంఘటనల మీద రాసుకున్న ఫిక్షనల్ స్టోరేనీ ‘కల్కి’. కొల్లాపూర్ సంస్థానానికి సేనాధిపతిగా ఉన్న నర్సప్ప (అశుతోష్ రాణా) రజాకార్లతో చేతులు కలిపి రాజును వెన్నుపోటు పొడుస్తాడు. రాజ కుటుంబం మొత్తాన్ని అంతంచేసి సంస్థానాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. ఆ తర్వాత నర్సప్ప చేయని అరచాకాలు ఉండవు. జనాన్ని ఒకరకంగా నరకం చూపిస్తూ ఉంటాడు. ఆ అరాచకంతోనే తొలి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడు. అయితే అన్నకి విరుద్దంగా నర్సప్ప తమ్ముడు శేఖర్ బాబు(సిద్ధు జొన్నలగడ్డ)కు ఊళ్లో మంచి పేరుంటుంది. ప్రజలతో చాలా ప్రేమగా మెలుగుతుంటాడు. అయితే అలాంటి వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేస్తారు. ఎవరు చంపారు ? ఎందుకు చంపారు ? ఏమి ఆశించి చంపారు ? అనే విషయం మీద ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఐపీఎస్ అధికారి కల్కి (రాజశేఖర్) వస్తాడు. ఇక ఆ కేసుని కల్కి ఎలా సాల్వ్ చేశాడు ? ఆదా శర్మ, నందితా శ్వేతా పాత్రలు ఏమిటి అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.  

విశ్లేషణ :

గరుడవేగ తర్వాత రాజశేఖర్ చేసిన సినిమా కావడంతో కల్కి సినిమా మీద ఆసక్తి నెలకొని ఉంది. దానికి తోడు టీజర్ ట్రైలర్ కూడా బాగుండటంతో సినిమాలో విషయం బాగానే ఉంటుందని ప్రేక్షకులు నమ్మారు. ఇక కధ విషయానికి వస్తే ఇప్పటికే ఎన్నో సార్లు చూసిన మర్డర్ మిస్టరీని ఈ సినిమాలో మరోసారి చూపించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. కాకపోతే అది 1983 నేపథ్యంలో చిత్రీకరించాడు. రాజవంశం నుంచి మొదలుపెట్టి నిరంకుశత్వం వరకు సాగే ఒక ఊరు పెద్ద చేసే అరాచకమే ఈ కల్కి సినిమా. అ లాంటి భిన్నమైన సినిమా తెరకెక్కించిన ప్రశాంత్ కల్కితో పక్కా కమర్షియల్ రూట్ లోకి వచ్చాడు. హీరో కొడితే గాల్లోకి ఎగరడం ఒక్కడే వచ్చి 100 మందిని నరకడాలు. ఇవన్నీ రెండో సినిమాకే బాగా వంట పట్టించుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఓవైపు పక్క కమర్షియల్ కథ చెబుతూనే మరోవైపు భిన్నమైన స్క్రీన్ ప్లేతో కథను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు ఈ దర్శకుడు. ఫస్టాఫ్ చాలా వరకు ఆసక్తికరంగా సాగింది. ఆ ఊరు, ఊర్లో జరిగే మర్డర్లు. వాటిని కనుక్కోవడానికి వచ్చే పోలీస్ ఆఫీసర్, జర్నలిస్టు ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ బాగానే అనిపించాయి. కానీ ఇంటర్వెల్ తర్వాత మాత్రం అనుకున్నంత ఆసక్తికరంగా కల్కి సినిమా సాగలేదేమో అనిపించింది. కన్ఫ్యూజన్ లేకుండా కథ క్లారిటీగానే చెప్పినా మరీ రొటీన్ కథ కావడం ఒక్కటే కల్కికి మైనస్. గరుడవేగ తర్వాత సినిమా కాబట్టి ఓపెనింగ్స్ వరకు ఓకే కానీ. రాజశేఖర్ కోరుకున్న బ్రేక్ మాత్రం ఈ సినిమాతో రావడం కష్టమే.

నటీనటుల విషయానికి వస్తే ఇలాంటి సినిమాలకు హీరో క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలి. కానీ, ఈ సినిమాలో అదే లోపించింది. ఇలాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను రాజశేఖర్ పండించలేకపోయారు. ఆయనలో వయోభారం స్పష్టంగా అర్ధం అవుతోంది. దానిని కప్పిపుచ్చడానికి వేసిన మేకప్ బాగా ఓవర్ అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలనైతే బాగానే మ్యానేజ్ చేశారు. కానీ అభినయం చూపాల్సిన సమయంలో విఫలం అయ్యారు. జర్నలిస్టు దత్తు పాత్రలో రాహుల్ రామకృష్ణ చాలా నేచురల్‌గా నటించారు. రాజశేఖర్ ప్రేయసిగా నటించిన అదాశర్మకు సినిమాలో పెద్ద స్కోప్ లేదు. నందితాశ్వేత పాత్ర సినిమాకు కీలకమే అయినా ఆమెను కూడా పెద్దగా చూపలేదు. విలన్ పాత్రలో అశుతోష్ రాణా ఎప్పటిలానే అదరగొట్టాడు. శత్రు, సిద్ధు జొన్నలగడ్డ, పూజిత పొన్నాడ, నాజర్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఫైనల్ గా : మర్డర్ కేసు గెలిచిన కల్కి....ప్రేక్షకుల మనసు గెలవ లేకపోయాడు.

రేటింగ్ : 2.5 /5.

More Related Stories