English   

నాగ్ ఆ డైరెక్టర్ ని నమ్మడం లేదా ?

movie
2019-06-29 07:56:13

నాగార్జున కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఒకటి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పెద్ద అంచనాలు లేకుండా రిలీజ్ అయి ఈ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు అనే సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం మీద అప్పట్లో నాగార్జునే క్లారిటీ కూడా ఇచ్చారు. కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని అది పూర్తయ్యాక సెట్స్ మీదకి వెళుతుందని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికర అంశం ఒకటి వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమా కోసం దర్శకుడు కళ్యాణ్ కృష్ణకి రెమ్యునరేషన్ ఇవ్వడం లేదట. రెమ్యునరేషన్ బదులుగా సినిమా హిట్ అయితే లాభాల్లో వాటా ఇస్తానని నాగార్జున ప్రపోజ్ చేశారని అనుకుంటున్నారు. దీనికి ఆ దర్శకుడు కూడా ఒప్పుకున్నాదనేది టాక్. నిజానికి ఈ తరహా ఒప్పందాలు హిట్ ఇస్తాడని నమ్మకం లేని దర్శకుల మీద దిల్ రాజు లాంటి నిర్మాతలు ప్రయోగాలూ చేస్తూ ఉంటారు. ఇలా చెబితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసి ఎలా అయినా హిట్ కొట్టి పెడతాడనే ఉద్దేశంతో, మరి నాగ్ ఎందుకు ఈయనకు ఇలాంటి ఆఫర్ ఇచ్చాదనేది ఆశ్చర్యకరంగా మారింది. అయితే కళ్యాణ్ కృష్ణ గత చిత్రం రవితేజతో తెరకెక్కించిన నేలక్ టికెట్ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇలాంటి నిన్ర్యనం తీసుకున్నాడా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

More Related Stories