English   

మరో దండ యాత్ర మొదలెట్టిన పూరీ తమ్ముడు...కానీ

sai
2019-06-29 08:13:57

సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా సినిమాలు చేస్తూ  సొంతంగా తాను కూడా హీరోగా సినిమాలు చేసి ఎంతో తను కూడా నిలదోక్కునే ప్రయత్నం చేయాలని చూస్తున్నాడు శాయి రామ్ శంకర్. డజను సినిమాలకి పైగా చేసినా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చెప్పుదోగ్గ సినిమా కాదు. అయితే తమ్ముడిని లైన్ లో పెట్టాలని విశ్వ ప్రయత్నం చేసిన పూరీ అది కుదరకపోవడంతో ఇప్పుడు కొడుకుని లైన్ లో పెట్టె పనిలో పడ్డాడు. అయితే కొడుకుని చూసుకుంటూ తనను పట్టించుకోవడం లేదనుకున్నాడో ఏమో కానీ సాయి రామ్ శంకర్ తాజాగా ఆయన ఒక కొత్త సినిమా ఒప్పుకుని ఓపెనింగ్ కూడా చేసేశారు. కృష్ణ చిరుమామిళ్ల అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఆయన ఈ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకి సంబందించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే తలుపులమ్మ లోవగుడిలో జరిగాయి. వైకాపా పెద్ద‌లు ఈ సినిమాకి నిర్మాత‌గా మారిన‌ట్టు తెలుస్తోంది. పూరి జ‌గ‌న్నాథ్‌కి వైకాపాతో సంబంధాలున్నాయి. పూరి సోద‌రుడు వైకాపా పార్టీ త‌ర‌పున న‌ర్సీప‌ట్నం ఎం.ఎల్‌.ఏగా గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికీ వైకాపా నేత‌లే నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు టాక్‌. దీంతో వైసీపీ ప్రముఖులు ఈ సినిమా ఓపెనింగ్ కి హాజరయ్యారు. కాకపోతే పూరి జగన్ మాత్రం ఈ లాంచ్ కి రాలేదు. దీంతో ఇద్దరికీ చెదిందా అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నా అదేమీ లేదని అయన ఇస్మార్ట్ శంకర్ ప్యాచప్ వర్క్ లో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది.

More Related Stories