English   

ఓ బేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్...ఛీఫ్ గెస్ట్ లు ఎవరంటే ?

samantha
2019-06-29 11:46:50

రీసెంట్ గా మజిలీ సినిమాతో హిట్ కొట్టిన సమంతా తాజాగా నందినిరెడ్డి దర్శకత్వంలో ఓ బేబి అనే ప్రయోగాత్మక సినిమా చేసింది. ఆమె ఈ సినిమాలో బేబీ అనే పాత్ర పోషిస్తోంది. కొరియాలో మంచి హిట్ అయిన మిస్ గ్రానీకి అఫీషియల్ తెలుగు రీమేక్‌ ఈ మూవీ. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. నాగశౌర్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమాని జూలై 5న ఓ బేబి విడుద‌ల చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఈరోజు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంఫా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఈరోజు సాయంత్రం నిర్వహిస్తున్నారు. హైద‌రాబాద్‌ లోని జేఆర్సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో ఈ ప్రోగ్రాం ఈరోజు ఆరుగంటలకి ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఎవరు గెస్ట్ గా వస్తారు అనే విషయాన్ని కొద్ది సేపటి క్రితమే ప్రకటించారు. వారు ఎవరంటే విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి. ఈ సినిమాని సురేష్ బాబు రిలీజ్ చేస్తుండగా ఈ సినిమా ఈవెంట్ కి వీరిద్దరూ చీఫ్   గెస్ట్ లుగా వ్యవహరించనున్నారు. ఇక ఇప్పటిదాకా వెంకటేష్ హాజరవుతున్న అన్ని ఈవెంట్స్ సినిమాలు హిట్ అవుతున్నాయి. చూడాలి మరి ఈ సినిమా కూడా అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తుందో లేదో ? ఈ సినిమాలో వృద్ధురాలు పాత్రలో ప్ర‌ముఖ న‌టి ల‌క్ష్మీ క‌నిపిస్తారు. రాజేంద్రప్రసాద్‌, ముసలి సమంతకు స్నేహితుడిగా, రావు రమేశ్‌ కుమారుడిగా, మాస్టర్‌ తేజ మనవడిగా కనిపించనున్నారు.

More Related Stories