English   

బుర్ర కధ కొత్త రిలీజ్ డేట్...ఆ రెండు సినిమాలకి పోటీగా ?

Burra Katha
2019-06-29 12:25:16

డైలాగ్ కింగ్ సాయి కుమార్ కుమారుడు హీరో ఆది సాయికుమార్‌ లీడ్ రోల్ లో మిష్టీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా బుర్రకథ. ఈ సినిమాతో ప్రముఖ డైలాగ్ రైటర్ డైమండ్‌ రత్నబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అయితే ఈ సినిమాను నిన్న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేశారు. కానీ ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా సెన్సార్‌ సర్టిఫికేషన్‌ పూర్తి కాక పోవడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇక ఈరోజు విడుదల చేస్తామని కూడా ప్రకటించారు యూనిట్. అయితే మళ్ళీ నిన్న సాయంత్రానికి కూడా సెన్సార్‌ విషయంలో క్లారిటీ రాకపోవడంతో ఈ సినిమాను మళ్ళీ వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక ఈ సినిమాని వచ్చే నెల ఐదవ తారీఖున రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది సినిమా యూనిట్. తొలి రెండు సినిమాలు తప్ప మరే సినిమాలూ హిట్స్ లేక  ఇబ్బందుల్లో ఉన్న ఆదితో పాటు దర్శకుడు డైమండ్‌ రత్నబాబు ఇదే మొదటి సినిమా వటంతో ఈ ఇద్దరి కెరీర్‌లకు ఈ సినిమా కీలకంగా మారింది. అలా రెండు మార్లు రిలీజ్ ఆగిన ఈ సినిమా జులై ఐదున రిలీజ్ అవనుంది. ఆ రోజున మరో రెండు సినిమాలు ఇప్పటికే డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. సమంతా లీడ్ రోల్ లోని ఓ బేబీ ఒక సినిమా అయితే, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, జీవితా రాజశేఖర్ ల కుమార్తె తెరంగ్రేటం చేస్తున్న దొరసాని మరో సినిమా.

More Related Stories