English   

బుల్లితెర మీదకి ప్రభాస్...అలా ఒప్పించారు ?

 Prabhas
2019-06-29 12:34:29

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి సిగ్గెక్కువ, ఆన్ స్క్రీన్ ఎంత రొమాంటిక్, మాటకారిగా ఉంటాడో ఆఫ్ స్క్రీన్ అంత సిగ్గరి. ఈ విషయాన్ని ఆయనే చాలా మార్లు చెప్పుకున్నాడు. అయితే ఈ సిగ్గుల మొగ్గను త్వరలో బుల్లి తెరమీదకి తీసుకురానున్నాడు యాంకర్ ప్రదీప్. ఓర్నీ యాంకర్‌ ప్రదీప్‌కీ, ప్రభాస్‌కీ సంబంధం  ఏంటని అనుకుంటున్నారా ? అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. జీ తెలుగులో పాపులర్ ప్రొగ్రామ్ కొంచెం టచ్ లో ఉంటే చెబుతా. ప్రదీప్ యాంకరింగ్ తో మరోసారి ఈ సిరీస్ ను ప్రారంభింస్తోంది ఆ ఛానెల్అందుకు కారణం సాహో సినిమా, ఎందుకంటే సాహో సినిమా హిందీ శాటిలైట్ హక్కుల్ని జీ గ్రూప్ దక్కించుకుంది. ఏకంగా 50 కోట్ల రూపాయలు చెల్లించింది. ఆ చనువుతోనే నిర్మాతల ద్వారా ప్రభాస్ ని సంప్రదించి, ఈ షోలో పాల్గొనేలా ప్రభాస్ ను ఒప్పించింది. ఈ షోకి రావడంతో ప్రభాస్ కూడా సాహో ప్రమోషన్స్ మొదలుపెట్టినట్టు అవుతుంది. అనట్టు ఈ సినిమా రిలీజ్ కి కూడా పెద్దగా టైం లేదండోయ్.

More Related Stories