English   

నక్కతోక తొక్కిన సందీప్ రెడ్డి....ఏకంగా సూపర్ స్టార్ తొనే సినిమా ?

Sandeep Reddy
2019-06-29 13:39:03

అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న ఈయన రెండో సినిమా తెలుగులోనే చేస్తారని అనుకున్నారు అందరూ. కానీ అదృష్టమో కష్ట ఫలితమో కానీ అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్ చేసి కబీర్ సింగ్ పేరుతో రిలీజ్ చేశాడు. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. హిట్ కావడమే కాక భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతున్నది.  నాలుగు రోజుల్లో వందకోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇక మరిన్ని రికార్డుల వైపు దూసుకు వెళ్తోంది. ఈ నేపధ్యంలో అయన ప్రిన్స్ మహేష్ బాబు కోసం సందీప్ ఒక కథను సిద్ధం చేశారని ఈ ఏడాది మొదటిలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ విషయం ఏమైందో తెలీదు కానీ  ఆయనకు బంపర్ ఆఫర్ తగిలిందని చెబుతున్నారు. నిజానికి ఈ సినిమా ఆడియెన్స్ కి భీబత్సంగా నచ్చింది. కానీ అక్కడి క్రిటిక్స్ ఈ సినిమాకి తీసి పారేస్తున్నారు. అయినా ఎక్కడా తగ్గట్లేదు ఈ సినిమా. ఈ నేపధ్యంలో సందీప్ రెడ్డికి టి సీరీస్ రూపంలో మరో అవకాశం వచ్చిందని బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అక్కడి వర్గాల సమాచారం మేరకు మొదటి సినిమాతోనే బాలీవుడ్ లో రచ్చ రేపిన సందీప్ రెడ్డికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సినిమా చేసే అవకాశం టి సీరీస్ ఇచ్చిందని అంటున్నారు. సందీప్ మేకింగ్ నచ్చడంతో ఆయన సినిమా చేసేందుకు సల్మాన్ కూడా ఒప్పుకున్నారని అంటున్నారు. సల్మాన్ తో సినిమా అనేది చాలా మంది బాలీవుడ్ దర్శకుల కల, అలాంటిది రెండో సినిమాకే సందీప్ రెడ్డి చాన్స్ కొట్టేయడం అంటే మనోడిది మామూలు లక్ కాదు.  

More Related Stories