English   

బంగార్రాజు కంటే ముందే కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నాగ్ !

Kalyan Krishna
2019-06-29 17:23:41

ఒక పక్క మన్మధుడు 2 షూటింగ్ లో పాల్గొంటున్న కింగ్ నాగార్జున మరోపక్క బిగ్ బాస్ సీజన్ 3 చెయ్యడానికి రెడీ అయిపోయారు.  మొదటి రెండు సీజన్స్ కి ప్రేక్షకులు బాగా అలవాటు పడడంతో ఈ మూడో సీజన్ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి, ఇప్పటివరకు హోస్ట్ గా ఎవరు వ్యవహరిస్తారో అన్నదాని పై సర్వత్రా చర్చ కొనసాగింది ఇక ఇప్పుడు ఆ వార్తలకు చెక్ పెడుతూ స్టార్ మా యాజమాన్యం ఒక ప్రోమో రిలీజ్ చేసింది. మార్కెట్ కి వెళ్లి నాగార్జున ఆయిల్, బియ్యం, కూరలు, గుడ్లు లాంటివి కొంటున్నట్టు ఒక ప్రోమో విడుదల చేశారు. మాటీవీ ఆధ్వర్యంలో మరొకొన్ని ప్రకటనలు కూడా రూపొందిస్తున్నారు. సీజన్ 3 కోసం ఒక ప్రోమో రిలీజ్ కాగా మరో మూడు నాలుగు ప్రోమోలను కూడా సిద్ధం చేస్తున్నారట, దీనికి సంబంధించిన వర్క్ జోరుగా సాగుతుందని అంటున్నారు. ఈ ప్రోమోలను డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడట. ఈయన ఇప్పుడే కాక నాగార్జున గతంలో నటించిన కళ్యాణ్ జ్యూయలర్స్ యాడ్ కి కూడా పని చేశారట. దీంతో ఇప్పుడు నాగ్ కళ్యాణ్ కి ఈ బాద్యతలు అప్పగించినట్టు చేబుతున్నారు. ఇక తెలుగులో యాడ్స్ తీయడంలో త్రివిక్రమ్, కొరటాల కూడా సిద్దహస్తులే.

More Related Stories