English   

సింహానికి డబ్బింగ్ చెబుతున్న నాని

Nani
2019-06-29 17:32:32

వాల్ట్ డిస్నీ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన లయన్ కింగ్ సినిమా దాదాపు అన్ని భారతీయ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో కూడా ఈ సినిమాని భారీ స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అందుకే డిస్నీ సంస్థ లయన్‌ కింగ్‌ సినిమా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ప్రముఖ నటులతో ఆ సినిమాలో జంతువుల పాత్రలకి డబ్బింగ్‌ చెప్పించింది. లయన్‌ కింగ్‌లో సింహం పేరు సింబా. అలాగే స్కార్‌, ముఫాసా అనే రెండు సింహాలు, పుంబా అనే అడవి పంది, టీమోన్‌ అనే ముంగిస ఈ సినిమాలో మిగిలిన కీలక పాత్రలు. స్కార్‌ అనే సింహానికి జగపతిబాబు డబ్బింగ్‌ చెప్పగా ఈ సినిమాలో హీరో సింబా తండ్రి ముఫాసా పాత్రకు రవిశంకర్‌ డబ్బింగ్‌ చెప్పారు. ఇక ముందే టిమోన్ పాత్రకు అలీ – పుంబా పాత్రకు బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పేశారు. ఇక ల‌య‌న్ కింగ్ లో సింబా నే హీరో,  ఈ పాత్ర చాలా ముఖ్య‌మైన‌ది కూడా అందుకే ఈ పాత్ర‌కి హిందిలో షారుక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ తో డ‌బ్బింగ్ చెప్పించారు. ఇప్ప‌డు తెలుగులో నేచుర‌ల్ స్టార్ నాని డబ్బింగ్ చెబుతున్నారు. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ప్ర‌తి పాత్ర‌కి స్టార్స్ తోనే డ‌బ్బింగ్ చెప్పిస్తున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా అన్ని ముఖ్య భాషల్లో వచ్చే నెల 19న లయన్‌ కింగ్‌ చిత్రం విడుదలవుతుంది. 

More Related Stories