English   

రఫ్ఫాడిస్తున్న రణరంగం టీజర్.. శర్వానంద్ అదుర్స్..

ranarangam
2019-06-29 20:20:25

పడి పడి లేచింది మనసు ఫ్లాప్ తర్వాత శర్వానంద్ నటిస్తున్న సినిమా రణరంగం. కేశవ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ముంబై నేపథ్యంలో పూర్తిగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది ఈ సినిమా. ఇందులో శర్వానంద్ మాఫియా డాన్ గా నటిస్తున్నాడు.1990 ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రాణంగా నిలవనున్నాయి. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వస్తా అంటున్నాడు శర్వానంద్. పడి పడి లేచే మనసు భారీ డిజాస్టర్ అయిపోయింది. దాంతో ఈ సినిమా ఎలాగైనా విజయం సాధించాలని కసిమీద ఉన్నాడు శర్వానంద్. తాజాగా విడుదలైన టీజర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. సినిమాలో పాతికేళ్ళ యువకుడిగానే కాకుండా 40 ఏళ్ల మధ్య వయస్కుడుగా కూడా నటిస్తున్నాడు శర్వానంద్. టీజర్ లో శర్వానంద్ తో పాటు కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ క్యారెక్టర్స్ కూడా పరిచయం చేసాడు సుధీర్ వర్మ. మరోవైపు ఈ దర్శకుడికి కూడా విజయం అందుకోవడం అనివార్యంగా మారింది. ఆగస్టులో రణరంగం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఖచ్చితంగా ఈ సినిమా సంచలనం సృష్టిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. మరి వాళ్ల నమ్మకాన్ని రణరంగం సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.

 

More Related Stories