English   

జబర్దస్త్ ను వదిలే సమస్యే లేదంటున్న అనసూయ..

anu
2019-06-29 20:35:27

యాంకర్ అనసూయ ఈ రోజు ఈ స్టేజ్ లో ఉందంటే కారణం జబర్దస్త్ కామెడీ షో. ఈ టీవీలో వచ్చే ఈ షోతోనే అమ్మడు స్టార్ యాంకర్ అయిపోయింది. ఆ తర్వాత నటిగా కూడా మారింది. ఈ మధ్య భారీ సినిమాల్లో నటిస్తూ స్టార్ అయిపోయింది అనసూయ. ఆమె కోసం ప్రత్యేకంగా పాత్రలు కూడా రాస్తున్నారు దర్శక నిర్మాతలు. క్షణం, రంగస్థలం, యాత్ర లాంటి సినిమాలలో ప్రత్యేకంగా నిలిచిపోయే పాత్రలు చేసింది అనసూయ. ఇదిలా ఉంటే ఇప్పుడు కొరటాల శివ, చిరంజీవి సినిమాలో కూడా అనసూయ కీలక పాత్రలో నటించబోతోంది. దానికి తోడు కథనం అనే సినిమాలో కూడా నటిస్తుంది అనసూయ. వరుసగా భారీ సినిమాల్లో అవకాశాలు రావడంతో జబర్దస్త్ కామెడీ షో ని వదిలేస్తుందనే ప్రచారం మొదలైంది. ఇటు సినిమాలకు అటు కామెడీ షో డేట్స్ అడ్జెస్ట్ చేయలేక తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ అనసూయ వదిలేయక తప్పడం లేదు అంటూ వార్తలు వినిపించాయి. దీనిపై ఇన్ని రోజులు కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.. దాంతో నిజంగానే ఈ భామ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతుంది అని ప్రచారం ఎక్కువైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో స్వయంగా అనసూయ ఈ షో పై కామెంట్ చేసింది. ఇప్పుడే కాదు ఇంకా ఎన్ని సినిమాలు వచ్చినా.. ఎన్ని అవకాశాలు వచ్చినా తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కామెడీ షో ను వదిలి పెట్టే సమస్యే లేదని చెబుతోంది అనసూయ. ఎట్టి పరిస్థితుల్లోను డేట్స్ అడ్జస్ట్ చేస్తాను కానీ ఆ షో మాత్రం వదిలి పెట్టను అంటుంది ఈ ముద్దుగుమ్మ. స్వయంగా అనసూయ క్లారిటీ ఇవ్వడంతో జబర్దస్త్ నుంచి ఆమె తప్పకుంటుందనే ప్రచారానికి ప్రస్తుతానికి తెర పడింది.

More Related Stories