English   

మీడియాపై ఫైర్ అయినా సూపర్ స్టార్ మహేష్ బాబు..

mb
2019-06-29 21:26:37

ఎంత సెలబ్రిటీలు అయినా.. స్టార్ హీరో అయినా వాళ్ళు కూడా మనుషులే. వాళ్లకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. వాటితో ఎవరు ఆడుకోకూడదు. కాకపోతే ఇప్పుడు మహేష్ బాబు విషయంలో ఇదే జరిగింది. ఈ మధ్య విజయనిర్మల మరణించడం.. తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు మొత్తం ఆమెకు సంతాపం తెలియజేయడం జరిగింది. ఇదే సందర్భంలో మహేష్ బాబు కూడా విజయనిర్మల నివాసానికి వచ్చాడు. ఆమెకు నివాళులర్పించడానికి వచ్చిన సూపర్ స్టార్ ను మీడియా ప్రతినిధులు వీడియో తీశారు. అక్కడే మహేష్ బాబుకు కోపం వచ్చింది. ఎలాంటి సందర్భంలో తాను వచ్చాను.. అలాంటి సందర్భంలో మీరు వీడియో తీయడం ఏంటి సార్ అంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేశాడు మహేష్. ఇప్పుడు ఎందుకు వీడియో తీస్తున్నారు సర్ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు మహేష్. ఆయన అసహనంలో కూడా అర్థం ఉంది.. అక్కడున్న పరిస్థితులను బట్టి మీడియా వాళ్లు కూడా వ్యవహరించి ఉంటే బాగుండేది అంటున్నారు విశ్లేషకులు. వాళ్లకు హుందాగా ఉంటే మహేష్ బాబు కూడా అలాగే ఉండేవాడు కాకపోతే.. ఆయన నడిచి వస్తున్న సమయంలో మీడియా కెమెరామెన్లు ఆయన పైన ఫోకస్ పెట్టి వీడియో తీయడంతో కాస్త అసహనానికి లోనయ్యారు సూపర్ స్టార్. కానీ చాలా వినయంగా సమాధానం చెప్పి లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులు కూడా మహేష్ బాబు వీడియోలు తీయకుండా సైలెంట్ అయిపోయారు. మొత్తానికి మహేష్ కు కోపం రావడం చాలా అరుదు.. వచ్చినా కూడా బయటకు చూపించడు సూపర్ స్టార్. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం తెలియకుండానే ఎమోషన్స్ బయటకు వచ్చేస్తాయి.

More Related Stories