English   

నా స్నేహితుల్లో లెస్బియన్లు ఉన్నారంటున్న రెజీనా..

regina
2019-06-29 21:42:26

లెస్బియన్.. ఈ పదం వినడానికి కూడా చాలా సిగ్గు పడుతూ ఉంటారు. స్వలింగ సంపర్కం తప్పు కాదు అని కోర్టు సంచలన తీర్పు ఇచ్చినా కూడా ఇంకా దాన్ని తీసుకుని పొజిషన్లో భారతీయులు లేరు. ఇతర దేశాల్లో లెస్బియన్, గే కల్చర్ బాగానే అభివృద్ధి చెందింది. కానీ ఇండియాలో మాత్రం ఇంకా అలాంటి రిలేషన్స్ రాలేదు. అయితే బాలీవుడ్లో మాత్రం ఇలాంటి కల్చర్ పై సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య సోనమ్ కపూర్, రెజీనా ప్రధాన పాత్రలో నటించిన ఏక్ లడికి తో దేఖా తో ఐసా లగా సినిమా ఇలాంటి నేపథ్యంలోనే వచ్చింది. ఈ చిత్రంలో సోనమ్ కపూర్, రెజీనా ఇద్దరు లెస్బియన్ గా నటించారు. వాళ్ళిద్దరూ ప్రేమలో పడటం.. ఆ తర్వాత ఇలాంటి విచిత్రమైన పరిణామాలు ఎదుర్కోవడం.. అనే సంఘటనల చుట్టూ ఈ చిత్ర కథను అల్లాడు దర్శకుడు. సినిమా ఫ్లాప్ అయినా కూడా వాళ్లు చేసిన ప్రయత్నానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ సినిమాలో నటనకు రెజీనాకు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా విడుదలైన చాలా రోజులకు తాజాగా మీడియాతో కొన్ని విషయాలు పంచుకుంది రెజీనా. ముఖ్యంగా సోనం కపూర్ సినిమాలో నటించిన తర్వాత తనకు చాలా మంది నుంచి ప్రశంసలు దక్కాయని.. ముఖ్యంగా తన స్నేహితులు కూడా ఈ సినిమా చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇంకా చెప్పాలంటే తన స్నేహితులు చాలామంది లెస్బియన్స్ ఉన్నారని.. అందుకే వాళ్లకు ఇంకా బాగా సినిమా కనెక్ట్ అయ్యింది అంటోంది రెజీనా. ఆమె చెప్పడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా నిజంగానే ఇప్పుడు మెట్రో నగరాల్లో ఈ లెస్బియన్ కల్చర్ బాగానే పెరిగిపోయింది. అందులో తన స్నేహితులు ఎక్కువగా ఉన్నారని చెబుతోంది రెజీనా. ఇక తన పెళ్లిపై వస్తున్న పుకార్లకు కూడా చెక్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తన పెళ్లి గురించి గాని నిశ్చితార్థం గురించి గాని నోరు విప్పి చెప్పే వరకు ఎవరి మాటలు నమ్మొద్దు అని చెబుతోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులో చిన్న సినిమాలు చేస్తుంది రెజీనా.

More Related Stories