English   

కమెడియన్ వేణుమాధవ్ ఇంట తీవ్ర విషాదం

venu
2019-06-30 16:52:33

హాస్య నటుడు వేణుమాధవ్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన అన్నయ్య విక్రమ్‌ బాబు నిన్న గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు ప్రస్తుతం 54 సంవత్సరాలు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆయన వేణు మాధవ మద్దతుతో కొన్ని సినిమాలకి సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. కాప్రాలోని హెచ్‌బీ కాలనీ మంగాపురంలో ఆయన ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. తొమ్మిది రోజుల కిందటే ఆయన తన ముగ్గురు కుమార్తెలలో ఒక కూతురు వివాహాన్ని కూడా ఘనంగా జరిపించారు. అయితే శుక్రవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఈసీఐఎల్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆసుప్రతిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూన్న ఆయన నిన్న ఉదయం మృతి చెందారు. విక్రమ్‌ బాబుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నిన్న సాయంత్రం లక్ష్మీనగర్‌ శ్మశానవాటికలో విక్రమ్ బాబు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే తన ఇంట శుభకార్యం జరిగిన కొన్నిరోజుల్లోనే ఆయన కన్నుమూయడం అందరినీ కలచి వేస్తోంది.

 

More Related Stories