English   

ఆదా శర్మ....చెడ్డవాళ్ళు ఎవరమ్మా ?

sharma
2019-06-30 19:36:37

తెలుగులో పూరీ హీరోయిన్ గా హార్ట్ ఎటాక్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆదా శర్మ చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి పేరు తెచ్చుకుంది. అయితే పెద్దగా ఆఫర్స్ రాకాపోయినా ఇంకా విక్రమార్క ప్రయత్నం చేస్తోంది. ఆమె తాజా సినిమా కల్కితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆమె మాట్లాడుతూ కల్కి సినిమాలో తాను చేసిన పాత్ర బాగా నచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. తన కెరియర్లో నేను చేసిన మంచి పాత్రల్లో ఇదొకటని, రాజశేఖర్ గారితో కలిసి నటించడం ఆనందంగా వుందని చెప్పుకొచ్చింది. అక్కడిదాకా బానే ఉంది కానీ ఆమె చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు కలకలం రేపుతోంది. అదేంటంటే తన కెరియర్లో రాజశేఖర్, పూరి జగన్నాథ్ వంటి మంచి వాళ్లనే కాదు, కొంతమంది చెడ్డవాళ్లను కూడా చూడాల్సి వచ్చిందని అంటోంది. అయితే ఆదా చెప్పిన మంచి వాళ్ల సంగతి అలా ఉంచితే ఆమె చేసిన సినిమాల్లో ఆమెకు ఎదురు అయిన చెడ్డ వాళ్లు ఎవరా ? అనే చర్చ మొదలయ్యింది. నిజానికి చాలా మంది హీరోయిన్స్ గతంలో క్యాస్టింగ్ కోచ్ ఆరోపణలు చేశారు. అయితే ఈమె అలంటి ఆరోపణలు చేయకుండా చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు అంటూ చెప్పడమే ఆసక్తికరంగా మారింది. అంతేకాక మంచి కథల కోసం మంచి పాత్రల కోసం వెయిట్ చేయడం వలన గ్యాప్ వస్తోంది కానీ తెలుగు ఇండస్ట్రీకి నేను ఎప్పుడూ దూరంగా లేనని కూడా ఆమె చెప్పుకొచ్చింది.

 

More Related Stories