English   

చాలా త్వరగా కోలుకున్న శర్వా...ఈరోజు సినిమా ఓపెనింగ్

sharwa
2019-06-30 20:46:36

ఈ మధ్య కాలంలో షూటింగ్ లో భాగంగా భారీ ప్రమాదం బారినపడ్డ హీరో శర్వానంద్ మళ్లీ సెట్ మీదకు వచ్చేస్తున్నారు. నిజానికి ఆయనకి పెద్ద సర్జరీ జరగడంతో ఆయనకి రెండు నెలలు బెడ్ రెస్ట్ అని ఇంకా ఆయన రెండు నెలల పాటు ఎక్కడికీ వెళ్ళరని ఇక సెట్ మీదకయితే వచ్చే ప్రసక్తే లేదని ప్రచారం జరిగింది. ఇది జరిగి పది రోజులు కూడా సరిగా పూర్తి కాకుండానే ఆయన మళ్ళీ లేచి తిరిగేస్తున్నాడు. నిన్ననే ఆయన  తనకి చికిత్స అందించిన డాక్టర్స్ కి శుభాకాంక్షలు చెబుతూ వారితో ఫోటోకి కూడా ఫోజిచ్చాడు. అయితే లేచి నుంచోవడం మాత్రమే కాదు షూట్ కు కూడా రెడీ అయిపోతున్నాడని సమాచారం. ఆయన పూర్తిగా రికవర్ అయ్యాడని అందుకే మళ్ళీ షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అయ్యాడట. ఈరోజు ఆయన 14రీల్స్ బ్యానర్ తో సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభింస్తారట. అలాగే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న 96 సినిమాకు జులై నెలాఖరు నుంచి షెడ్యూలు కూడా రెడీ చేసుకోమని దిల్ రాజుకు శర్వానంద్ చెప్పినట్లు లేటెస్ట్ న్యూస్. నిజానికి 96 సినిమా షూటింగ్ లోనే శర్వానంద్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ సినిమాను వీలయినంత త్వరగా పూర్తి చేసి దసరా కానుకగా రిలీజ్ చేయాలని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ డేట్ మిస్ కాకూడదని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే నిన్న టీజర్ రిలీజయున రణరంగం సినిమా రిలీజ్ కి సిద్దమయ్యింది.

More Related Stories