English   

జనసేన ఫిలిం ఇన్స్టిట్యూట్...పవన్ తప్పు చేస్తున్నారా ?

Pawan Kalyan
2019-07-01 09:10:02

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చర్యలు ఊహాతీతం అని ఆయన సినిమాలో ఓక డైలాగ్ ఉంటుంది. నిజానికి బయట కూడా అంతే ప్రవర్తిస్తారు ఆయన. ఆయన ఏమి చేస్తారో ఎందుకు చేస్తారో ఊహించడం కష్టమే తాజాగా ఆయన ఓ నిర్ణయం ఏపీ మొత్తం మీద ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో పవన్ - ఆయన పార్టీ రెండూ ఘోరంగా విఫలం అయ్యాయి. అయినా ఓడినా గెలిచినా తాను ప్రజలకు అండగానే ఉంటానని చెబుతున్నారు పవన్. ఈ క్రమంలో రాజకీయాలు చూసుకుంటూనే ఔత్సాహిక యువత కోసం తమ సొంత ఊరు దగ్గరలో ఒక ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభిస్తున్నానని ప్రకటించి కలకలం రేపారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న మాజీ మంత్రి హరిరామ జోగయ్యను ఆదివారం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే, ఈ సందర్భంగా పాలకొల్లులో జనసేన ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు హరిరామ జోగయ్య చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దర్శకుడు రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్‌గా ఉంటారు. నిర్మాత బన్నీ వాసు ఇన్‌స్టిట్యూట్ కార్యకలాపాలు చూసుకుంటారని పేర్కొంటూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. పాలకొల్లులో టాలీవుడ్‌ లెజెండ్‌ ఎస్వీ రంగారావు పేరుతో ఈ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ లాంటి గొప్ప దర్శకులు పాలకొల్లు నుంచి వచ్చిన వారేనని ఆ ప్రకటనలో గుర్తు చేసింది. అయితే ఇప్పటికే కుల పార్టీ అని ప్రత్యర్ధి పార్టీల విమర్శలు ఎదుర్కొంటున్న పవన్, మళ్ళీ అదే తప్పి చేస్తున్నారా అనే అనుమానాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే ఆయన పేర్కొన్న ముగ్గురూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. పవన్ సామాజిక వర్గం విషయంలో ఎప్పుడు తప్పు చేస్తాడా అని ఎదురు చూస్తున్న వారికి స్వయంగా చాన్స్ ఇచ్చినట్టు అవుతుందేమో ?

More Related Stories