English   

త్వరలో మరో టాలీవుడ్ క్రేజీ కాంబో ?

Vijay Devarakonda
2019-07-01 10:28:18

పెళ్లిచూపులు సినిమాతో అందరి దృష్టిలో పడిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత సందీప్ వంగా డైరెక్షన్‌లో చేసిన అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత చేసిన గీతా గోవిందం, టాక్సీ వాలా లాంటి సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. త్వరలోనే ఇటీవల నటించిన డియర్ కామ్రేడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్ త్వరలోనే టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి ఒక అదిరిపోయే లవ్ స్టోరీ చేస్తున్నట్టు చెబుతున్నారు. నిజానికి రంగస్థలం వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సుక్కూ ఎవరితో సినిమా చేస్తాడా అనే ఆసక్తి నెలకొంది. అయితే మహేష్ బాబుతో కలిసి సినిమా చేద్దామని అనుకున్నా క్రియేటివ్ డిఫరెన్స్ఎస్ వలన ఆ ప్రాజెక్టును ఆగి పోవడం ఆ వెంటనే అల్లు అర్జున్ తో సుక్కూ సినిమా ప్రకటించడం వెంటవెంటనే జరిగిపోయాయి. కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న నేపథ్యంలో సుకుమార్-బన్నీ చేయబోయే సినిమా చేయడానికి కాస్త లేట్ ఆయె అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యేడాదిలో ఆయన విజయ్ తో సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇది ఎంత వరకూ నిజం అవుతుందో తేలేదు కానీ రెండ్రోజుల నుండి విపరీతంగా వైరల్ అవుతోంది. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో.  

More Related Stories