English   

రాజు గారి గది నుండి బయటకొచ్చేసిన తమన్నా

 Tamanna
2019-07-01 10:43:25

ఈమధ్యనే తమన్నా హీరోయిన్‌ గా యాంకర్-డైరెక్టర్ ఓంకార్ దర్శకత్వంలో ‘రాజు గారి గది 3’ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాజు గారి గది అంటూ తీసిన ఒక సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్‌గా నాగార్జున, సమంత లీడ్ రోల్స్ చేసిన రాజు గారి గది 2 తెరకెక్కించారు. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ కాలేదు కానీ యావరేజ్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో మొన్ననే ఈ సినిమాకు మూడో సీక్వెల్‌గా తమన్నా ముఖ్యపాత్రలో రాజు గారి గది 3 సినిమాకు రీసెంట్‌గా కొబ్బరికాయ కూడా కొట్టారు. ఈ సినిమాను కూడా గత రెండు సినిమాల లానే ఓంకార్ తన సొంత నిర్మాణంలోనే తెరకెక్కిస్తున్నాడు. అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఫస్ట్ షెడ్యూల్ కోసం సెట్‌లో అడుగుపెట్టిన తమన్నా తనకు పూర్తిగా కధ చెప్పలేదని తెలుసుకుందట. నిజానికి ముందుగా ఆమెకు ఆమె పాత్ర వరకే కధ చెప్పి ఓంకార్ డేట్స్ తీసుకున్నారట. అయితే ఆ తర్వాత సెట్ లోకి వచ్చాక కధ ఆమెకు నచ్చలేదట. దీంతో ఆమె కధ మార్చమని ఓంకార్ కి సూచించిందట. అయతే తన కధ మీద పూర్తి నమ్మకంతో ఉన్న ఓంకార్ కధ మార్చానని తెగేసి చెప్పాడట. దీంతో తమన్నా వెంటనే ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నానని చెప్పి తప్పుకుందని చెబుతున్నారు. ఈ విషయం మీద మరింత క్లారిటీ రావలసి ఉంది.
 

More Related Stories