English   

సైరా ముంగిట మరో వివాదం 

Ram Charan
2019-07-01 11:05:14

మెగా హీరో, నిర్మాతగా మరి తన తండ్రి చిరంజీవితో ఇప్ప్పటికే ఒక సినిమా నిర్మించి రెంచో సినిమా సెట్స్ మీద ఉన్న రామ్ చరణ్ తేజ్ ఆఫీస్ బయట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తీసుకున్న సమయంలో తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని కానీ ఇప్పుడు కనీసం కలవడం లేదని ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా న‌ర‌సింహారెడ్డి, స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత ఆధారంగా తెరక్కుతున్న సినిమా ఇది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ళాక ఉయ్యాల‌వాడ వంశంలోని వారు అభ్యంతరాలు తెలిపారు. అప్పట్లో వివాదం ఏర్పడగా రామ్ చరణ్ వారితో కలిసి మాట్లాడారు, అక్కడితో అది సద్దుమణిగింది. అయితే అప్పుడు వారూ వారూ ఏమి మాట్లాడుకున్నారో తెలీదు కానీ తాజాగా నిన్న బయటకు వచ్చిన మహిళ చేసిన ఆరోపణల ప్రకారం ఆరోజు ఉయ్యాలవాడ వారసులుయిన 7 కుటుంబాల్లోని 22 మంది కుటుంబ స‌భ్యుల‌తో సినిమా యూనిట్ ఓ అగ్రిమెంట్ చేసుకున్నారట, ఉయ్యాలవాడ కధ వాడుకుంటున్నందుకు గాను ఉయ్యాల‌వాడ కుటుంబ స‌భ్యుల‌కు స‌హాయం చేస్తాన‌ని ఆ అగ్రిమెంట్ లో ఉందట.  ఇప్పటి వరకు ఆర్థిక సాయం అందలేదని, లీగ‌ల్‌గా అసలు ఉయ్యాల‌వాడ కుటుంబ స‌భ్యుల‌కు హ‌క్కు లేద‌ని అంటున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయంలో చరణ్ స్పందించి తమను ఆదుకోవాలని ఆమె కోరారు. అయితే కాసేపటికి అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపేశారు.  ఇక ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 

More Related Stories